“టెన్షన్ పెట్టినా గెలిపించారు చాలు.!” అంటూ…రెండవ వన్డేలో శ్రీలంకపై ఇండియా గెలవడం పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“టెన్షన్ పెట్టినా గెలిపించారు చాలు.!” అంటూ…రెండవ వన్డేలో శ్రీలంకపై ఇండియా గెలవడం పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

కొలంబో వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 276 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7 చేసింది. మొదటి ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షా (13: 11 బంతుల్లో 3×4) మూడవ ఓవర్లో బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ (29: 38 బంతుల్లో 6×4) వికెట్ చేజార్చుకున్నారు.

Video Advertisement

trending memes on ind vs sl second odi (1)

 

ఒక ఎండ్‌ లో క్రీజ్ లో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ (53: 44 బంతుల్లో 6×4) జట్టుని గెలుపు దిశగా నడిపించారు. సూర్యకుమార్ యాదవ్ కి సపోర్ట్ ఇచ్చిన మనీశ్ పాండే (37: 31 బంతుల్లో 3×4) రనౌట్ అయ్యి వెనుదిరగగా సూర్యకుమార్, కృనాల్ పాండ్య (35: 54 బంతుల్లో 3×4) వికెట్లు చేజార్చుకున్నారు. చివరి వరకు క్రీజ్ లో నిలిచిన దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7×4, 1×6) చివరిలో ఫాస్ట్ బౌలర్లని టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టారు. అవసరమైన దశలో బౌండరీలు బాదుతూ వచ్చి భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్: 28 బంతుల్లో 2×4) తో మంచి కోఆర్డినేషన్ కనబరిచారు.

అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (50: 71 బంతుల్లో 4×4, 1×6) జట్టుకు మెరుగైన ఆరంభం ఇవ్వగా మిడిల్ ఓవర్లలో చరిత అసలంక (65: 68 బంతుల్లో 6×4), చివర్లో చమిక కరుణరత్నె (44: 33 బంతుల్లో 5×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు, యుజ్వేందర్ చాహల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like