కార్తీకదీపం ఫేమ్ “వంటలక్క” బుల్లితెర సీరియల్స్ ప్రేక్షకులకే కాదు సోషల్ మీడియా లో కూడా పాపులర్. ఆమె వచ్చే ట్రోల్స్ ఆమెను ట్రేండింగ్ లో నిలబెడుతున్నాయి. వంటలక్క సీరియల్ కార్తీక దీపం కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ కొత్త గా చెప్పక్కర్లేదు. ఎన్ని సీరియల్స్ వచ్చిన కార్తీక దీపం టాప్ లోనే ఉంటోంది. అయితే, ఈ సీరియల్ ను ఢీ కొట్టడానికి ఇతర ఛానెళ్ల సీరియళ్లు కూడా పోటీ పడుతున్నాయి.

తాజాగా ఈ బాటలోనే “కృష్ణ తులసి” అనే మరో సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. కార్తీక దీపం వంటలక్క తరహా లోనే “కృష్ణ తులసి” సీరియల్ లో కూడా డీ గ్లామరస్ గా ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్యామా ను కూడా నలుపు రంగులో, డీ గ్లామరస్ గా కష్టాల కడలి లో మునిగిపోయినట్లు చూపిస్తున్నారు.

ఈ సీరియల్ లో కథేమిటంటే.. శ్యామా చాలా అద్భుతమైన గాత్రం తో పాటలు పాడుతుంది. కానీ, ఆ గాత్రాన్ని ఆమె సవతి చెల్లెలికి దానం చేసేస్తూ తాను మాత్రం తెర వెనక బతికేస్తుంటుంది. నలుపు రంగైనా ఆత్మాభిమానం ఉన్న మనిషి గా.. అచ్చం మన వంటలక్క లా కనిపించింది ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో చూడగానే. ఇటీవలే జీ తెలుగు “ఇది వెలుగు నీడల పయనం, శ్యామా జీవన గమనం..” అనే పాట తో ప్రోమో ను విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదల అయినప్పటి నుంచి కార్తీక దీపం తరహా కధాంశం తో ఉందని.. ఆ సీరియల్ కి ఇది గట్టి పోటీ ఇస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఊపందుకుని సోషల్ మీడియా లో మీమ్స్ వేసి ట్రోల్స్ చేసేవరకు వచ్చింది.

#1.

#2.

#3.

#4.

#5.

watch video: