నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాకి, ఇండియాకి మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశారు. దీంతో కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మొదటి భారత క్రికెటర్ గా ఘనత సాధించారు. టీ బ్రేక్ సమయానికి రోహిత్ శర్మ 207 బంతుల్లో 15×4, 2×6 సాయంతో 118 పరుగుల స్కోర్ చేశారు.

Video Advertisement

రోహిత్ శర్మతో జోడిగా ఉన్న రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కూడా 82 బంతుల్లో 6×4 సాయంతో 34 పరుగులు చేసి క్రీజ్ లో నిలిచారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకి ఆల్ అవుట్ అవ్వగా టీ బ్రేక్ సమయానికి 226/5తో నిలిచిన భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.

trending memes on rohit sharma century in ind vs aus

ఓవర్‌నైట్ స్కోర్‌ 56 తో ఈరోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ శర్మ మిగిలిన వాళ్ళు పెవిలియన్ బాట పడుతున్నా సరే పట్టుదలతో ఆడారు. అశ్విన్ (23), చతేశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) స్కోర్ చేసి ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకి వికెట్లు చేజార్చుకున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం బౌలింగ్ లో తన మార్క్ ఫుల్ షాట్స్‌తో బౌండరీలు సాధించారు. తర్వాత రోహిత్ శర్మ 120 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11