ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) సీజన్ 15 లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో సన్రైజర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తర్వాత సన్రైజర్స్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 168 పరుగు చేసి విజయాన్ని అందుకుంది.

Video Advertisement

టాస్ ఓడిపోయి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ కు శుభారంభం దక్కలేదు. ఫామ్ లో ఉన్నటువంటి శుబ్ మన్ (7), భువనేశ్వర్, సాయి సుదర్శన్ (11)ను, నటరాజన్ పెవిలియన్ కు పంపారు. వేడ్(19) చేసి నిరాశపరచడంతో జట్టు 64 పరుగులకే 3 వికెట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ సందర్భంలో కెప్టెన్ హార్థిక్ (50 నాటౌట్ ) తోడుగా అభినవ్ మనోహర్ (35 ) రాణించారు. గుజరాత్ టీమ్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు అందించాడు. డేవిడ్ మిల్లర్(12) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా చివరి ఓవర్ వేసి నటరాజన్ తేవాటియా (6), రషీద్ ఖాన్(0) అవుట్ చేసి గుజరాత్ జట్టుకు స్కోర్ ఇవ్వకుండా ఆపగలిగారు. దీంతో 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

trending memes on srh winning over gujarat in ipl 2022

ఇక సన్రైజర్స్ బౌలర్లు (2/34), భువనేశ్వర్, (2/37)కు తోడుగా జెన్సస్, ఉమ్రాన్ మాలిక్ లు ఒక్కో వికెట్ తీశారు. చేదనలో సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, విలియమ్మాస్ (57), అర్థ సెంచరీతో దూసుకు పోగా, చివర్లో పురాన్(37 నాటౌట్ 18 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు ) చేశారు. రషీద్, హార్థిక్ కు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ విజయంలో సన్రైజర్స్ జట్టు నాలుగు మ్యాచుల్లో 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14