ఈ 5 చిట్కాలు పాటిస్తే గ్యాస్ సిలిండర్ వాడకాన్ని తగ్గించవచ్చు..!

ఈ 5 చిట్కాలు పాటిస్తే గ్యాస్ సిలిండర్ వాడకాన్ని తగ్గించవచ్చు..!

by Anudeep

Ads

రోజురోజుకీ ఎండల మండిపడినట్లు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతున్నాయి. వెయ్యి రూపాయలు తగ్గేదే లేదు అన్నట్లు గ్యాస్ సిలిండర్ ధర కొండెక్కి కూర్చుంటుంది. గ్యాస్ ని ఎంత పొదుపుగా వాడితే మనకు అదనపు ఆర్ధిక భారం తగ్గినలే లెక్క .

Video Advertisement

ఇక ఎలా పడితే అలా గ్యాస్ ను మనం వినియోగిస్తే మన జేబులకు చిల్లులు పడినట్టులే. మనం గ్యాస్ ని ఎంత పొదుపుగా వినియోగిస్తే అంత మేలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

Cylingr

వంట ఉండే ఆడవాళ్ళతో సహా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు సహకరిస్తేనే గ్యాస్ సిలిండర్ కు అయ్యే ఎక్కువ ఖర్చును అదుపులో ఉంచుకోగలరు. మరి ఏ చిట్కాలు పాటిస్తే గ్యాస్ సిలిండర్ ఆదా చేయగలమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

#1.

Soaked dal

ప్రతి ఒక్కరూ పప్పు ధాన్యాలు, బియ్యం  శుభ్రం చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ మీద పెట్టి చూస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. దీనివలన గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలా కాకుండా  పప్పు ధాన్యాలను, బియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టి వండడం ద్వారా గ్యాస్ వృధా కాకుండా ఆదా అవుతుంది.

#2.

ఏదేనా వండేముందు వంటకు కావలిసిన కూరగాయలు అన్ని ముందే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే స్టవ్ పైన కాలాయి పెట్టి అవసరమైన వాటికోసం ఎక్కువసార్లు తిరగటం వలన గ్యాస్ వృధా అవుతుంది.

#3.

Cook in pressure cooker

ఎక్కువసేపు ఉడకడానికి టైం పాటే మాంసం, దుంపలు, పప్పులు వంటివి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకోవటం మంచిది. దీనివలన టైం మరియు గ్యాస్ రెండు ఆదా అవుతాయి.

#4.

కొందరు కూరలు ఉడికే సమయంలో వాటిపైన మూత వేయకుండా వండుతూ ఉంటారు. అలానే మరికొందరు కూరలు ఉడుకుతునప్పుడు పదే పదే మూత తీసి చూస్తూ ఉంటారు. ఎలా చేయడంవలన కూరలో వున్నా నీరు త్వరగా ఆవిరి అయిపోయి కూర సరిగ్గా మగ్గాదు. దీనికోసం మరల కూరలో నీరుపోసి ఉడికిస్తాం. ఇందుకుగాను అదనపు గ్యాస్ ఖర్చు అవుతుంది.

#5.

కొందరు కూరలు త్వరగా ఉడుకుతాయి అనే భావనతో స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తూవుంటారు. ఇలా హై ఫ్లేమ్ లో వండటం వలన కూర ఉడకకపోగా అదనంగ గ్యాస్ వేడి బయటకిపోతుంది. గ్యాస్ వృధా కాకుండా వుండాలి అంటే స్టవ్ పై పెట్టిన పాత్రకు సరిపడే ఫ్లేమ్ లో మంటను పెట్టుకోవాలి.

ఇలా సరిఅయిన చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ వృధాకాకుండా మరియు మనపై అదనపు ఆర్ధిక భారం పడకుండా జాగ్రత్తపడవచ్చు.


End of Article

You may also like