త్రివిక్రమ్ కెరీర్ నిలబడడానికి ఆ మహిళా రచయిత కారణమా..? ఆమె ఎవరంటే..?

త్రివిక్రమ్ కెరీర్ నిలబడడానికి ఆ మహిళా రచయిత కారణమా..? ఆమె ఎవరంటే..?

by Harika

Ads

తన డైలాగ్స్ తో యువతని ఉర్రూతలూగించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన తీసిన ప్రతి సినిమాలోని తన మార్కు ఎమోషనల్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండేలాగా చూసుకుంటారు. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే చాలు మొదటి రోజే థియేటర్ కి వచ్చి చూడాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత డైరెక్షన్ మీద ఉన్న ఆసక్తి కొద్ది డైరెక్టర్ గా కూడా మారి చాలా సినిమాలకు డైరెక్ట్ చేసి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

Video Advertisement

అయితే ఇటీవల ఆయన సినిమాలో త్రివిక్రమ్ మార్కు ఎమోషన్స్ ఎక్కువగా కనిపించడం లేదు. గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్ కనిపించకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై విరుచుకుపడుతున్నారు.

అయితే ఇప్పుడు అదే విషయంగా ఆయనపై ట్రోలింగ్స్ వస్తున్నాయి ఇన్నాళ్లు త్రివిక్రమ్ యద్దనపూడి సులోచన రాణి నవలలని ఆధారంగా చేసుకొని సినిమాలను తీసేవారు. వాటికి అనుగుణంగానే డైలాగ్ లను డెవలప్ చేసేవారు . అయితే యద్దనపూడి సులోచనారాణి మరణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెద్ద లోటు గా అనిపిస్తున్నట్లు ఉంది.

yaddanapudi sulochana rani

ఆమె బ్రతికి ఉంటే ఈపాటికి ఒక నాలుగు, ఐదు నవలలు రాసి ఉండేది. ఇప్పుడు ఆమె నుంచి ఎలాంటి నవల్స్ రాకపోవడంతో త్రివిక్రమ్ నుంచి కొత్తదనం కొరవడింది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. గుంటూరు కారం సినిమా కూడా యద్దనపూడి సులోచనారాణి కీర్తి కిరీటాలు నవల నుంచి తీసుకున్న కథాంశమే. కొద్దిగా మార్పులు చేర్పులతో ఈ సినిమాని సిద్ధం చేశారు త్రివిక్రమ్. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది అన్నది మాత్రం వాళ్ళ వాళ్ళ అభిమానులకు మాత్రమే తెలిసి ఉంటుంది.

ఇక ఆ విషయం పక్కన పెట్టి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న సినిమాతో అయినా హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీ త్రివిక్రమ్ ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ సక్సెస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


End of Article

You may also like