ఐపీఎల్ 14వ సీజన్ లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సన్ ‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. లీగ్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) తో ఇన్నింగ్స్ ప్రారంభించారు. భువనేశ్వర్‌ వేసిన 3వ ఓవర్‌లో మిడ్‌ వికెట్‌లో షాబాజ్‌‌ నదీమ్‌ అద్భుతమైన లో క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ బాట పట్టారు. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్కోర్‌ 20/1. క్రీజ్ ‌లో విరాట్ కోహ్లీ(4 బంతుల్లో 6; ఫోర్‌), షాబాజ్‌ అహ్మద్‌(1) ఉన్నారు.

షాబాజ్‌ అహ్మద్‌(10 బంతుల్లో 14; సిక్స్‌) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ అందించి రెండో వికెట్ ‌గా వెనుదిరిగారు.కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(18 బంతుల్లో 22; 3 ఫోర్లు) సింగల్స్‌ తీస్తూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తున్నా మ్యాక్స్‌వెల్‌(13 బంతుల్లో 7; ఫోర్‌) పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. షాబాజ్‌ నదీమ్‌ వేసిన 11వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ తన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. వరుసగా 6,4,6 పరుగులు చేశారు.

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీ సహాకారంతో ఆర్‌సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది. హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి వికెట్‌ కీపర్‌ సాహా చేతికి క్యాచ్‌ ఇచ్చిన మ్యాక్సీ(41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్ ‌గా వెనుదిరిగారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో హోల్డర్‌ 3 వికెట్లు, రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు, భువీ ఒక వికెట్, షాబాజ్ ఒక వికెట్‌, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ కం బ్యాక్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4

#5#6#7#8#9#10#11#12


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE