“అర్ధరాత్రి ట్రైన్ లో వాళ్ల వల్ల ఇబ్బంది పడుతుంటే..?” రైల్వే శాఖ అధికారులు ఏమి చేసారంటే?

“అర్ధరాత్రి ట్రైన్ లో వాళ్ల వల్ల ఇబ్బంది పడుతుంటే..?” రైల్వే శాఖ అధికారులు ఏమి చేసారంటే?

by Anudeep

మన రైల్వే డిపార్ట్మెంట్ అనేది అన్నిటికంటే ఎంతో పెద్ద విభాగం. ఎంతో మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరుస్తుంది. సంవత్సరానికి కొన్ని కోట్ల మంది ప్రయాణికులు  రైలులో ప్రయాణం చేస్తూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వేశాఖ విధి విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.

Video Advertisement

రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తుంది. అదేవిధంగా ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే సరైన నిర్ణయంతో సక్రమంగా పనిచేస్తుంది.

చైతన్య కనప్ అనే వ్యక్తి ఎదుర్కొన్న సమస్యను తన Quora అకౌంట్లో ఈ విధంగా పోస్ట్ చేసి, రైల్వే సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అతను తన quora ఖాతాలో పేర్కొన్న విషయం ఏంటంటే. ఈనెల జూన్ 17న నేను పర్బాబీ స్టేషన్ లో రైలు ఎక్కాను. రైలు నెంబర్ 17020  హైదరాబాద్ నుంచి జైపూర్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను.

అర్ధరాత్రి  సమయం కావడంతో అందరూ నిద్ర పోతున్నాం. ఉన్నట్టుండి  కొంతమంది గుంపు దాదాపు 3 గంటల నుంచి పెద్ద పెద్ద సౌండ్ తో సినిమాలు చూస్తూ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వాళ్లు చేసే ఆ పనికి కోచ్ లో ఉన్న మిగతా ప్రయాణికులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము.

మేము ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. నేను నిద్ర లేచి వాళ్ళపై రైల్వే శాఖకు కంప్లైంట్ చేయడానికి గూగుల్ లో వెతికాను. నేను @irctcoffical, @railindia కి మేము పడుతున్న సమస్య గురించి ట్వీట్ చేశాను.

వెంటనే ట్విట్టర్ ద్వారా రైల్వే సేవా రిప్లై వచ్చింది. మేము తగిన చర్యలు తీసుకుంటాం. మీ PNR మరియు ఫోన్ నెంబర్ ని అడిగి తీసుకున్నారు. రైల్వే శాఖ వారు వెంటనే నేను ట్వీట్ చేసిన సమస్యకు స్పందించి మా రైలు ప్రయాణిస్తున్న సంబంధిత జోన్ వారికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలను పంపించారు.

వెంటనే రైల్వే అధికారులు వచ్చి మేము ప్రయాణిస్తున్న కంపార్ట్మెంట్ లోని నాయిస్ పొల్యూషన్ చేస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమయింది రైల్వే శాఖ ఎంతో అభివృద్ధి చెందిందని. నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను రైల్వే శాఖ వారికి వెంటనే స్పందించి మా సమస్య తీర్చినందుకు.


You may also like