మనం ఎవరినైనా ఇష్టపడితే ప్రేమిస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నిజం గా ప్రేమించినా.. ప్రేమ అనుకుని పొరబడి ప్రేమించినా.. మనం ప్రేమించిన వారు బ్రేకప్ చెప్తే మాత్రం తట్టుకోలేనంత బాధ వస్తుంది. వారెందుకు ఇలా చేశారా అని ఆలోచిస్తూ ఉండిపోతాం. వారితో మాట్లాడకపోయినా.. బ్రేకప్ తరువాత వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనిస్తాం. ఎందుకంటే.. వారు తిరిగి మన వద్దకు వస్తారు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి.

ex love 1

ప్రేమ ఎవరిపై అయినా గట్టి ముద్ర నే వేస్తుంది. ప్రేమ తాలూకు గుర్తుల్ని అంత తేలికగా మరచిపోలేము. బ్రేకప్ చెప్పిన తరువాత వారి లైఫ్ పై మనం మరింత క్యూరియాసిటీ పెంచుకుంటాం. అయితే… వారు మన వద్దకు తిరిగి వస్తారా..? లేదా ? అని ఆలోచిస్తూ ఉండిపోతాం. వారు తిరిగి మన దగ్గరకి వస్తే బాగుండు అని కోరుకుంటాం. కానీ ఒక్కోసారి మనం విపరీతం గా ఆలోచించడం వలన తొందరపాటుతో వారికి మెసేజ్ లు చేస్తూనో, కాల్స్ చేస్తూనో ఉంటాం.

ex love 2

వీటివల్ల దూరం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. మరి మనలని కాదనుకుని వెళ్లిపోయిన వారు తిరిగి రావాలంటే ఏమి చేయాలి..?

ముందు మీరు వారి చర్యలకు రియాక్షన్ ఇవ్వడం మానేయండి. మనకి బ్రేకప్ చెప్పాక.. వారికి కూడా మన లైఫ్ పై క్యూరియాసిటీ ఉండడం సహజం. వారి ఫోటోలకు మనం స్పందిస్తున్నామా లేదా..? వారు పెట్టె పోస్ట్ లకు ఎలా రియాక్ట్ అవుతున్నాం..? వంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారి సోషల్ మీడియా అకౌంట్స్ ను చూడడం మానేయండి. వారి ఫొటోస్, పోస్ట్స్ వేటికీ స్పందించకండి.

ex love 3

మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో మీరు ఆనందం గా ఉన్న ఫోటోలను పంచుకోండి. మీ ఫ్రెండ్స్ తో, స్నేహితులతో సన్నిహితం గా ఉన్న ఫోటోలను పంచుకోండి. మీ కళ్ళలో కనిపించే ఆనందమే వారిని తిరిగి ఆలోచించేలా చేస్తుంది.

అలాగే మీ లుక్స్ పై కూడా శ్రద్ధ పెట్టండి. గతం లో కంటే అందం గా కనిపించడానికి ప్రయత్నించండి. కొత్త బట్టలు కొనుక్కోండి. తద్వారా మీ మూడ్ కూడా ఉత్సాహం గా మారుతుంది. వారిని పట్టించుకోనట్లు ప్రవర్తించండి. ఇలా చేయడం వలన వారు మీ గురించి మరింత ఎక్కువ గా ఆలోచిస్తారు. అంతే కాదు.. వారు మీ లైఫ్ లోకి తిరిగి వచ్చినా రాకపోయినా.. మీ జీవితాన్ని మీరు హాయిగా ఆస్వాదించగలుగుతారు.