స్టాంప్ పేపర్లలో ఉన్న ఈ రకాల గురించి తెలుసా? ఏ స్టాంప్ పేపర్ ని ఏ అవసరం కోసం వాడతారంటే?

స్టాంప్ పేపర్లలో ఉన్న ఈ రకాల గురించి తెలుసా? ఏ స్టాంప్ పేపర్ ని ఏ అవసరం కోసం వాడతారంటే?

by Anudeep

Ads

ఒకప్పుడు స్టాంప్ పేపర్ల గురించి ప్రజలకు అవగాహన ఉండేది. కానీ, ప్రస్తుతం ప్రతి దానికీ ఇంటర్నెట్ పై ఆధార పడడం మొదలు పెట్టాక స్టాంప్ పేపర్ల గురించి చాలా మంది తెలుసుకోవడం కూడా మానేశారు. ఇటీవల ఎన్నికల కాలంలో స్టాంప్ పేపర్ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇటీవల రాజకీయ నాయకులు ప్రజలలో నమ్మకం కలిగించుకోవడం కోసం.. తాము చేపట్టబోయే సంస్కరణల గురించి స్టాంప్ పేపర్లలో రాసి ఇచ్చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ స్టాంప్ పేపర్లలో కూడా రకాలు ఉంటాయి. వీటి విలువ కూడా వేరు వేరుగా ఉంటుంది. ఒక్కో స్టాంప్ పేపర్ ఖరీదు వేరుగానే ఉంటుంది. అయితే.. వీటి ఉపయోగం కూడా వేరుగా ఉంటుంది. ఇక ఈ పేపర్ ను ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం.

stamp 1

సాధారణంగా పది, ఇరవై, యాభై, వంద రూపాయల ఖరీదు చేసే స్టాంప్ పేపర్లను భూముల విక్రయాలు, ఆస్తుల క్రయ విక్రయాల కోసం వాడుతూ వస్తున్నారు. అయితే.. కేవలం వీటికోసమే కాకుండా దీని వలన ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.

#10 రూ. స్టాంపు:
దీనిని ఎక్కువగా నోటరీ కోసం వాడుతుంటారు. చిరునామా నిర్ధారణకు, పుట్టిన తేదీ సరి చేసుకోవడానికి ఈ స్టాంపు పేపర్ పై రాసుకుంటారు. తరువాత ఓ న్యాయవాదిచే సంతకం పెట్టించి సబ్మిట్ చేస్తారు. సెల్ఫ్ అఫిడవిట్ కి కూడా ఈ స్టాంప్ ని వినియోగిస్తూ ఉంటారు. ఇతర స్టాంప్ పేపర్లతో పోలిస్తే ఈ స్టాంప్ పేపర్ నే ఎక్కువగా వాడుతూ ఉంటారు.

stamp 2

#20 రూ. స్టాంపు:
ఏదైనా భూమి, స్థలం, భవనాలను కొనే సమయంలో ఆ స్థలానికి సంబంధించి విస్తీర్ణం తాలూకు వివరాలు, హక్కుదారుని వివరాలు, లోనుకు సంబంధించిన విషయాలను అధికారికంగా తెలుసుకోవడానికి ఈ స్టాంపు పేపర్లను వినియోగిస్తున్నారు. క్రయవిక్రయాల దస్తావేజుల కోసం కూడా ఈ స్టాంపు పేపర్లనే వినియోగిస్తూ ఉంటారు.

stamp 3

#50-100 స్టాంపు:
అన్ని రకాల క్రయ విక్రయాలకు ఈ స్టాంపు పేపర్ల అవసరం ఉంటుంది. పరస్పర ఒప్పందాలకు సంబంధించినవి, సెటిలెమెంట్ దస్తావేజులు, కుటుంబ బాగా పరిష్కార పత్రాలు వంటి వాటి కోసం ఈ స్టాంపు పేపర్లను వినియోగిస్తారు.


End of Article

You may also like