ఐఏఎస్ ఇంటర్వ్యూ లో అడిగిన ఈ 10 ప్రశ్నలు చూస్తే నవ్వాపుకోలేరు.! సెలెక్ట్ అయిన వారు చెప్పిన ఈ జవాబులు క్రేజీ!

ఐఏఎస్ ఇంటర్వ్యూ లో అడిగిన ఈ 10 ప్రశ్నలు చూస్తే నవ్వాపుకోలేరు.! సెలెక్ట్ అయిన వారు చెప్పిన ఈ జవాబులు క్రేజీ!

by Anudeep

Ads

ఐఏఎస్ పరీక్ష పాస్ అవ్వడం ఎంత కష్టమైనదో మనందరికీ తెలిసిందే.. ప్రతి ఏడాది వేలాది మంది ఈ పరీక్షలో పాల్గొనడానికి వస్తుంటారు. అయితే, ఈ పరీక్షలో పాస్ అవడం కూడా అంత తేలిక కాదు. ఎందుకంటే కేవలం నాలెడ్జి బేస్ మీదే కాకుండా, పర్సనాలిటీ పై కూడా ఈ ప్రశ్నలు ఉంటాయి.

Video Advertisement

ఎంతో తర్కం ఆలోచిస్తే కానీ సమాధానాలు చెప్పలేము. కొన్నిసార్లు ఊహించని విధంగా , తెలివిగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాత పరీక్ష తరువాత కూడా, కఠినమైన ఇంటర్వ్యూ ఉంటుంది.

Also read: “నీ చెల్లెలు అలా కనిపిస్తే ఏం చేస్తావు?” ఇంటర్వ్యూలో అడిగిన వింత ప్రశ్న..అతని సమాధానంకి ఆశ్చర్యపోయారు!

ఈ ఇంటర్వ్యూ లో కూడా సమయస్పూర్తి తో సమాధానాలు చెప్పిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. తెలివి తో పాటు, వ్యక్తిత్వాన్ని కూడా అభ్యర్థులు చెప్పే సమాధానాలను బట్టి అంచనా వేస్తారు. ఈ క్రమం లో ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎంతో ప్రిపేర్డ్ గా ఉండాల్సి ఉంటుంది. అసలు ఆ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఓ సారి చూద్దాం.. సరదాగా, వీటిని చూస్తే సమాధానాలు ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది.. మీరు కూడా ఓ లుక్ వేయండి ఓ సారి.

1 . ఒకవేళ, నేను మీ సోదరితో పారిపోతే మీరు ఏమి చేస్తారు?


సమాధానం : ఈ ప్రశ్నకు ఎంపికైన అభ్యర్థి ఏమని సమాధానం చెప్పాడో తెలుసా.. “మా సోదరికి మీ కంటే మంచి మ్యాచ్ ను తీసుకురాలేను సర్” అని చెప్పాడు.

2 . జామీ 45 వ అంతస్తులోని కిటికీ అద్దంలో తన ప్రతిబింబం వైపు చూశాడు. కొంత దూరం నడిచాక అతను కిటికీ గుండా మరొక వైపు దూకుతాడు. ఇంకా జామీకి ఒక్క గాయమూ కూడా తగల్లేదు. అతను మృదువైన ఉపరితలంపైకి దిగకపోయినా లేదా పారాచూట్ ఉపయోగించకపోయినా ఇది ఎలా సాధ్యమవుతుంది?

సమాధానం : జామి ఓ విండో క్లీనర్. పని పూర్తి అయ్యాక అలిసిపోయి బిల్డింగ్ లోపలి వైపుకు దూకాడు. అందుకే అతనికి గాయాలు అవలేదు.

3 . ఓ పచ్చి గుడ్డును పగుళ్లు లేకుండా కాంక్రీట్ అంతస్తులో ఎలా పడవేయవచ్చు?

సమాధానం : కాంక్రీట్ అంతస్తులు పగులగొట్టడం చాలా కష్టం. కేవలం ఒక్క పచ్చి గుడ్డు తో ఫ్లోర్ ని పగలగొట్టలేం.

4 . దేనిని చూస్తే సగం ఆపిల్ లాగా ఉంటుంది?

సమాధానం : ఆపిల్ రెండవ సగభాగాన్ని చూసినపుడు సగం ఆపిల్ లాగ ఉంటుంది.

5 . ఒకే నిలువు రేఖ ను ఉపయోగించడం ద్వారా, మీరు సమీకరణాన్ని ఎలా సరైనదిగా చేయవచ్చు. 5 + 5 + 5 = 550?


సమాధానం : పైన ఇచ్చిన సమీకరణం లో మొట్ట మొదటి ప్లస్ గుర్తు కు పైన క్రాస్ గా ఒక నిలువు రేఖను గీస్తే ఆ సంఖ్యా నాలుగు అవుతుంది. అప్పుడు 545+5=550 అవుతుంది.

6 . రాముడు తన “మొదటి దీపావళి” ఎక్కడ జరుపుకున్నాడు?

సమాధానం : ఈ ప్రశ్న వినగానే మొదట అయోధ్య అని గాని, మిథిలా నగరం అని కానీ ఆలోచిస్తాం. కానీ దీపావళి పండుగను వాస్తవం గా శ్రీ కృష్ణుడు నరకాసుర వధ చేయడం వలన జరుపుకుంటాం.. దశావతారాల్లో శ్రీ కృష్ణుని అవతారం ద్వాపర యుగం లో అంటే.. త్రేతాయుగం తరువాత వస్తుంది. ఈ లెక్కన శ్రీ రాముడు అసలు దీపావళి పండుగనే జరుపుకోలేదు.

7. బుధవారం, శుక్రవారం లేదా ఆదివారం అనే పదాలను ఉపయోగించకుండా మీరు వరుసగా మూడు రోజులకు పేర్లు పెట్టగలరా?


సమాధానం :నిన్న, ఈరోజు, రేపు.

8 . కొబ్బరి కాయను పగలు కొట్టకుండా ఎలా తింటారు?
సమాధానం : రాత్రి కొట్టి తినొచ్చు కదా

9. బంగాళాఖాతం ఏ స్టేట్ లో ఉంది?

సమాధానం : లిక్విడ్ స్టేట్ లో

10. ఒక పిల్లికి మూడు పిల్లులు ఉన్నాయి: జనవరి, మార్చి మరియు మే. తల్లి పేరు ఏమిటి.

సమాధానం : “ఏమిటి” అనేదే తల్లి పిల్లి పేరు.

చూసారు కదా.. ఈ సమాధానాలు చాల ఈజీ గానే ఉంటాయి. కానీ, ఆ క్షణం లో మనం అదే ఆన్సర్ అనే విషయాన్నీ గుర్తించలేము. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించడం వలన మన మనసు ఉల్లాసం గాను ఉంటుంది.. ఇంకా బ్రెయిన్ కి కూడా మంచి పదును పెట్టినట్లు అవుతుంది.


End of Article

You may also like