Ads
తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.ఈ సారి ఉగాది April 2 నాడు వస్తుంది.ఈ సారి ఉగాది కి వచ్చే పేరు “శ్రీ శుభకృత్ నామ సంవత్సర”.హిందూ మరియు వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఉపవాసము, వేడుకల, పండుగ, పంచాంగం మరియు ముహూర్తాలకు ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. అవి లేకుండా, హిందూ మతం లో ఏ ఒక పండుగను కూడా ఊహించలేరు. అమృతఘడియలు, హోరా, అభిజిత్, రాహు కాలం మరియు ఢోఘటి ముహర్తాల సహాయంతో ముహూర్తంను కూడా లెక్కించవచ్చు.
Video Advertisement
శ్రీ శుభకృత్ సంవత్సర తెలుగు రాశి ఫలాలు 2022-2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సర. దక్షిణాయనం, శీతాకాలం
కార్తీక మాసం, శుక్ల పక్షం, బుధ వారం
తిథి – నవమి పూర్తి
నక్షత్రం – ధనిష్ఠ పూర్తి
శుభ సమయం – ఉదయం 5.47 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 6.00 నుంచి 6.40 వరకు
2022-2023 మేషరాశి రాశి ఫలితాలు
ఈ మాసం నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగ మార్పులకు, సంతాన ప్రయత్నాలకు , వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభకరమైన పరిస్థితి కలుగచేయును. ధనాదాయం బాగుండును. బంధు కలయికలు – బంధు సంతోషాలు. నూతన వ్యక్తుల పరిచయాలు. పిల్లల విషయాలలో శ్రద్ధ వహించుట అవసరమగును. మూడవ సోమవారం నుండి ఆరోగ్య పరమైన క్షీణత సూచన. మానసిక ప్రశాంతత లోపించును. వ్యాపార రంగంలో మీదైన గుర్తుంపు నిలబెట్టుకుంటారు.
2022-2023 వృషభ రాశి ఫలితాలు
వృషభ రాశి : ఆరోగ్య పరమైన విషయములందు మినహా మిగిలిన విషయాలలో మంచి ఫలితాలను కలుగచేయును. నూతన ప్రయత్నాలు లాభించును. వ్యాపార వ్యవహరాదులు లాభించును. సంతాన సంభంధమైన ప్రయత్నాలు కలసి వచ్చుతెలుగును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధించును. ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తించును. ధనాదాయం బాగుండును.
2022-2023 మిధున రాశి ఫలితాలు
మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. మీరు ప్రేమ మూడ్ లో ఉంటారు, అవకాశాలు బోలెడు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది.కుటుంబ సంబంధాలు మెరుగవును. విలాసవస్తువుల కొరకు ధనం వెచ్చించేదురు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పాత ఋణాలు తీర్చివేసేదురు. ఆర్ధిక లక్ష్యాలు పూర్తిచెయగలరు. విదేశీ ప్రయత్నాలు విఘ్నాలు పొందేదును. ధనాదాయం వృద్ధి చెందును. జీవిత భాగస్వామితో సఖ్యత – సౌఖ్యం.
2022-2023 కర్కాటక రాశి ఫలితాలు
ప్రేమ ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. సమయమే నిజమైన ధనమని నమ్మితే, మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఒంటరిగా సమయము గడపటం మంచిది. కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.
2022-2023 సింహ రాశి ఫలితాలు
దాంపత్య జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు, అమ్మ నాన్న, బంధు మిత్రులతో తగాదాలు తగ్గు ముఖం పడుతాయి,ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకొని సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి.
2022-2023 కన్య రాశి ఫలితాలు
వ్యాపారాల్లో నష్టాలూ వస్తాయి, దేవుడి మీద భారం వేసి ముందుకు సాగడం మంచిది, కన్న బిడ్డలతో కొట్లాటలు జరుగుతాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.
2022-2023 తులా రాశి ఫలితాలు
మీ అతి ప్రేమ వల్ల మీ శ్రీమతికి ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్త్రత వహించండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. అతిగా ఆలోచించడం వలన అనర్ధాలు జరుగవచ్చు, వ్యాపారాల్లో స్వల్ప నష్టం వస్తుంది.ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.
2022-2023 వృశ్చిక రాశి ఫలితాలు
స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. కార్య సాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.
2022-2023 ధనుస్సు రాశి ఫలితాలు
కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు.ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.
2022-2023 మకర రాశి ఫలితాలు
ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. గృహమునకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.
2022-2023 కుంభ రాశి ఫలితాలు
ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, దనియాలు, బెల్లం, శెనగ వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.
2022-2023 మీన రాశి ఫలితాలు
కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి, మీరు కలవాలి అనుకొనే వ్యక్తి ని కలుస్తారు, ప్రేమ వ్యవహారాల్లో కొట్లాటలు తప్పవు, స్త్రీల ఉద్యోగాల్లో కొన్ని కష్టాలు ఎదురుకుంటారు.ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
తీపి, చేదు కలగలిపినదే జీవితం..
కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..
ఆ జీవితంలో ఆనందోత్సాహాలని
పూయించేందుకు వచ్చేదే
ఉగాది పర్వదినం
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులందరికీ
శ్రీ శుభకృత్ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు
Happy Ugadi Header or Banner Design with Golden Worship Pot (Kalash), Fruits, Flowers and Illuminated Oil Lamps on Bokeh Lights Effect Background.
Also Read : Ugadi Wishes Greetings In Telugu 2021
End of Article