కొత్త బట్టలకు వచ్చే ప్రైస్ ట్యాగ్స్ ని పడేస్తున్నారా..? వీటి వలన ఉపయోగం తెలిస్తే ఇంకెప్పుడూ పడేయరు..!

కొత్త బట్టలకు వచ్చే ప్రైస్ ట్యాగ్స్ ని పడేస్తున్నారా..? వీటి వలన ఉపయోగం తెలిస్తే ఇంకెప్పుడూ పడేయరు..!

by Anudeep

Ads

మన చుట్టూ ఉండేవి, మనం రోజు చూస్తూ ఉండేవి మనకి అన్ని తెలిసినవే అని అనుకుంటూ ఉంటాం. కానీ నిశితంగా గమనిస్తే మనకి తెలియని ఎన్నో విషయాలు మన చుట్టూనే ఉంటాయి. మనం గమనిస్తూ ఉన్న ప్రతిసారీ మనకి ఓ కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది.

Video Advertisement

మీరెప్పుడైనా గమనించారా..? మనం బ్రాండెడ్ షర్ట్స్ ని కొన్నప్పుడు ఆ షర్ట్ ల కాలర్స్ కి రకరకాల ట్యాగ్స్ ఉంటాయి. కొత్త షర్ట్స్ మాత్రమే కాదు టాప్స్, డ్రెస్సెస్ ఇలా ఏమైనా కొత్త బట్టలు కొన్నప్పుడు వాటి ప్రైస్ ని తెలిపే ట్యాగ్స్ ని ఇస్తూ ఉంటారు.

price tags 1

చాలా మంది కొత్త బట్టలు వేసుకునేటప్పుడు ఈ ట్యాగ్స్ అడ్డంగా ఉండడం వలన వీటిని తీసి డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు. మీరు కూడా అంతే కదా.. అయితే.. ఈ ప్రైస్ ట్యాగ్స్ ను పడేయకుండా దాచుకోవడం వలన మీ వార్డ్ రోబ్ లో బట్టలను అందంగా తక్కువ స్పేస్ లో ఎక్కువ బట్టలను సర్దుకోవచ్చు. అదెలా..? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి. ప్రైస్ ట్యాగ్స్ కు ఒక ప్లాస్టిక్ థ్రెడ్ ని కూడా ఇస్తారు. మీరు దాచిన అన్ని ప్రైస్ ట్యాగ్స్ కు ఉన్న ప్లాస్టిక్ దారాలను వేరు చేయాలి.

price tags 2

ఈ ప్లాస్టిక్ దారాలను మీ వార్డ్ రోబ్ లో హ్యాంగర్ పై భాగంలో వేసి ఆ దారానికి మరో హ్యాంగర్ ను తగిలించుకోవాలి. ఇలా రెండో హ్యాంగర్ కు కూడా ఆ దారాన్ని వేసి.. మీ బట్టలు తగిలించిన హ్యాంగార్లను ఒక దాని కింద ఒకటి తగిలించుకుంటూ రావచ్చు. అలా ఒక వరసలో నాలుగైదు హ్యాంగర్లను తగిలించుకోవచ్చు. తద్వారా మీ స్పేస్ కూడా మిగులుతుంది. తక్కువ స్పేస్ లో ఎక్కువ బట్టలను పెట్టుకోవచ్చు. అంతే కాదు.. చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది.


End of Article

You may also like