Ads
తప్ప తాగి తందనాలాడడం.. పిచ్చి కూతలు కూయడం.. ఆనక కొందరైతే.. ఏకంగా హత్యలు, మానభంగాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ.. ఎక్కువగా ఇలాంటి ఘటనలలో అమ్మాయిలే బలి అవుతూ ఉంటారు. అయితే.. రాజస్థాన్ లో మాత్రం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
రాత్రంతా మద్యం సేవించిన భార్యాభర్తలకి మధ్యలో గొడవ వచ్చింది.. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కొడుకు గదిలోంచి అరుపులు వినిపించడంతో కంగారుగా అతని తల్లి బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసింది.
అక్కడ కొడుకు శవం పక్కనే ఉన్న కోడలిని చూసి షాక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ పరిధి జాటియోలో మంజు, అనిల్ దంపతులు నివాసం ఉంటున్నారు. 6 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా.. ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. అనిల్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అనిల్, మంజు ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉంది. వీరికి వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు. ఈ క్రమంలో మద్యం తాగుతున్న సమయంలో వీరు గొడవ పడుతుండేవారు.
వీరి గురించి స్థానికులకు, తల్లి తండ్రులకు ముందే తెలుసు కాబట్టి వీరు గొడవ పడే టైం లో పెద్దగా పట్టించుకునేవారు కాదు. మంగళవారం కూడా ఇద్దరు మద్యం సేవించారు. ఈ క్రమంలోనే జీతం గురించి చర్చకి వచ్చి గొడవ పెరిగింది. నీ జీతం తక్కువ వస్తోంది.. ఇంటి ఖర్చులకి చాలటం లేదు అంటూ మంజు గొడవ చేసింది. అలా గొడవ పెద్దదైంది. అనిల్ కూడా ఆగ్రహంతో నానా మాటలు అన్నాడు.
దీనితో కోపగించిన మంజు బెల్ట్ తో అనిల్ మెడకు బిగించింది. ఊపిరి ఆడకపోవడంతో అనిల్ చాలా సేపు గింజుకుని ఆ తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే.. అప్పటికే చాలా సేపటినుంచి అరుపులు విన్న అనిల్ తల్లి భయంతో అక్కడకి వెళ్లి చూడగా.. అప్పటికే అనిల్ మరణించాడు. పోలిసుల దర్యాప్తులో మంజు నిజం అంగీకరించింది. అయితే.. జీతం విషయంలో గొడవ వల్లే ఈ దారుణం జరిగిందా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
End of Article