అమ్మ వారి కృపకు పాత్రులు కావడం అంత ఈజీ ఏమి కాదు.. ఎన్నో జన్మల పుణ్యం, భక్తి, కరుణ వంటి లక్షణాలు ఉండాలి. ప్రతి చోట అమ్మవారిని చూస్తూ ధ్యానించగలగాలి. ఐతే.. ఇవేమి లేకుండా.. ఓ ఆలయం లో దొంగతనం చేయడం వల్ల కూడా అమ్మ వారి అనుగ్రహం కలుగుతుందట. అదెక్కడంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చుడియాలా లోని చూడామణి అమ్మవారి ఆలయం. ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా అంటారట.

chudamani

అమ్మ వారి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఈ ఆలయం లో దొంగతనం చేయాల్సిందే. అంటే నగలు, డబ్బులు కాదు. అమ్మ వారి పాదాల వద్ద ఉండే చెక్క బొమ్మలను దొంగతనం చేయాలి. వాటిని దొంగతనం చేస్తే అమ్మ వారు అనుగ్రహించి వారికి సంతానం కలిగేలా చేస్తుందట. వారి కోరిక ఫలించాక.. తిరిగి ఆ దేవాలయానికి వచ్చి ఆ చెక్కబొమ్మలను సమర్పించాలట. ఇలా చేస్తే.. చూడామణి దేవి తన భక్తులను చల్ల గా చూసి కరుణిస్తుందట.