ఆ పుణ్య క్షేత్రం లో ఇప్పటికీ రాధాకృష్ణులు కలిసి ఉంటారట.. రాత్రయితే పిల్లన గ్రోవి, గజ్జల చప్పుడు.. ఎక్కడంటే..?

ఆ పుణ్య క్షేత్రం లో ఇప్పటికీ రాధాకృష్ణులు కలిసి ఉంటారట.. రాత్రయితే పిల్లన గ్రోవి, గజ్జల చప్పుడు.. ఎక్కడంటే..?

by Anudeep

Ads

పుణ్యక్షేత్రాలంటే.. దేవుళ్ళు స్వయంభువు గా వెలసిన క్షేత్రాలు మరియు ప్రత్యేకత కలిగిన క్షేత్రాలు. ఈ క్షేత్రాలలో దేవుళ్ళు, దేవతలు సూక్ష్మ అంశ లో సంచరిస్తూ భక్తులను కాపాడుతుంటారని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి పుణ్య క్షేత్రాలలో మధుర లో నిధివన్ కూడా ఒకటి. నిధివన్ గురించి అనేక ప్రచారాలు ఉన్నాయి.. అక్కడ నుంచి రాత్రి సమయం లో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దం, గజ్జల చప్పుడు వినిపిస్తుందట. అయితే, దీనివెనుక ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారట.

Video Advertisement

nidhivan 1

ఈ నిధివన్ ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఉంది. ద్వాపర యుగ కాలం లో ఈ ప్లేస్ రాధ కృష్ణుల అనుబంధానికి ప్రతీక గా నిలిచింది. అయితే, ఇప్పటికీ అక్కడ రాధా కృష్ణులు కలిసి తిరుగుతుంటారని చెబుతుంటారు. రాధను కలుసుకోవడం కోసం, శ్రీకృష్ణుడు ప్రతి రోజు అక్కడకి వస్తుంటాడని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఆ సమయం లో కృషుని భటులు వారి ఏకాంతానికి అడ్డు రాకుండా.. అక్కడే ఉండి అదృశ్య రూపం లో పహారా కాస్తుంటారట.

nidhivan 2

ఈ దేవాలయం లో సూర్యాస్తమయం వరకే దర్శనాలకు అనుమతిస్తారు. ఆ తరువాత ఈ ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. ఎవరిని లోపలకి అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రహస్యం గా చూడాలని ప్రయత్నించినా వారికీ తెల్లారేసరికి కళ్ళు పోవడమో.. లేదా పిచ్చివాళ్ళు అవ్వడమో జరిగేదట. ఓ సారి జ‌య‌పూర్ కు చెందిన ఓ భక్తుడు కూడా ఇలానే రహస్యం గా నిధివన్ లో ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే ఉండిపోయాడట. అయితే, తెల్లారేసరికి అతను ప్రధాన ద్వారం వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు.

nidhivan 3

అతడిని లేపి చూస్తే, ఎదో పిచ్చి పిచ్చి గా మాట్లాడూతూ.. పిచ్చివాడైపోయాడు. మరో భక్తుడికి కూడా ఇలానే జరిగినట్లు తెలుస్తోంది. నిధివన్ చుట్టూ చాలా ఇంటి సముదాయాలు ఉన్నాయి. కానీ, వారిలో ఎవరు కిటికీలను పెట్టుకోరు. సూర్యాస్తమయం దాటితే నిధివన్ వైపు ఎవరు చూడరు. ఒకవేళ కిటికీలు పెట్టుకున్నా, వాటిని మూసివేస్తారు. రాత్రి సమయం లో నిధివన్ నుంచి పిల్లన గ్రోవి వాయిస్తున్న సౌండ్స్, కాలి అందెల సౌండ్స్ గత కొన్ని వేల ఏళ్ల నుంచి వస్తున్నాయని చెబుతుంటారు. నిధివన్ చుట్టూ తులసి చెట్లు ఉంటాయి. ఇవి ప్రతి రెండు చెట్లు చొప్పున ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. పగటి సమయం లో ఇవి చెట్లు గా కనిపిస్తున్నా, రాత్రి సమయం లో ఇవి గోపికలుగా మారతాయని చెబుతుంటారు.

nidhivan 4

ఆ వనం మధ్య లో ఉన్న రంగమహల్ లో శ్రీకృష్ణుడు, రాధా ఏకాంతం గా గడుపుతుంటారని చెబుతుంటారు. ఆలయాన్ని మూసివేసే ముందు.. ఆ మహల్ లో మంచాన్ని అలంకరించి, స్వీట్లు, తాంబూలం, అగరుబత్తులు వెలిగించి ఉంచుతారట. ఉదయం వచ్చేసరికి.. తాంబూలం ఉమ్మిన గుర్తులతో పాటు, స్వీట్లు కూడా సగం తిన్న గుర్తులు ఉంటాయి. అలాగే పక్క కూడా కొంత చెదరి ఉంటుందట. అలాగే, ఈ నిధివన్ వద్ద ఉన్న కొలను ను శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవి తో సృష్టించాడని చెబుతుంటారు. నిధివన్ ను చూడడానికి వచ్చిన వారు ఈ కొలను ను కూడా దర్శనం చేసుకుంటారు. నిధివన్ లో దేవుడు లేడు అంటూ కొందరు నాస్తికులు వాదనలు చేశారు కానీ ఎవరు నిరూపించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అయ్యేవారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి సిసి కెమెరాలు ఏర్పాటు చేసినా కూడా విఫలమయ్యారు.


End of Article

You may also like