Ads
రామాయణం అంటే.. రాముడు నడిచిన దారి. అయోధ్య నుంచి లంకానగరం వరకూ సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. ఆ విలువల యాత్రలో రాముడికి ఎంతోమంది తారసపడ్డారు.
Video Advertisement
నావలో ఒడ్డు దాటించినవారు, ఎంగిలిపండ్లతో ఆతిథ్యమిచ్చి పుణ్యఫలాలు పొందినవారు, ఎదిరించి నేలకూలినవారు, ఆదరించి అస్త్రాలను ప్రసాదించినవారు, మోహించి ముక్కుచెవులు కోయించుకున్నవారు, ప్రపత్తితో పరమదాసులైనవారు, పాదస్పర్శతో జడత్వాన్ని వీడినవారు, మోహపీడితులై రామబాణానికి గురైనవారు.. కథా గమనంలో భాగంగానూ వాల్మీకి మహర్షి ఎన్నో పాత్రలను పరిచయం చేస్తారు.
అయితే రామాయణం లో మనకి తెలియని ఎన్నో కథలున్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
#1 మాయ సీత
రావణాసురుడి చెర నుంచి సీతని తీసుకు వచ్చిన తర్వాత రాముడు ఆమెతో అగ్నిప్రవేశం చేయిస్తాడు అని మనం చదువుకున్నాం. కానీ స్కంద పురాణం ప్రకారం; రావణుడు అపహరించిన సీత, అగ్నిప్రవేశం చేసినది సీత కాదు. ఆమె మాయ సీత. అగ్ని దేవుని భార్య స్వాహా తనను తాను సీతగా మార్చుకుంది.
సీతాపహరణానికి ముందే అగ్ని సీతను పాతాళలోకానికి తీసుకువెళ్లి, ఆమె స్థానంలో తన భార్య ‘స్వాహా’ని ఉంచినట్లు స్కంద పురాణం లో ఉంది.
#2 లక్ష్మణుని ప్రవర్తన
రావణుడు సీతను అపహరించినపుడు.. రాముడు తనను కనుగొనేందుకు సీత తన ఆభరణాలను విసురుతుంది. రాముడికి ఆ నగలు దొరికినపుడు లక్ష్మణుడికి చూపించాడు. లక్ష్మణుడు సీత పాదాల నుండి తన చూపులను ఎప్పటికీ ఎత్తలేదు కాబట్టి, అతనికి ఆమెకళ్ళకు ధరించే ఆభరణాలు మాత్రమే గుర్తుకు వచ్చాయి.
#3 రాముని మరణం
రాముని అవతారం చాలించాల్సిన తరుణం వచ్చినపుడు యముడు అయోధ్యలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు యముడిని అడ్డుకుంటాడు. హనుమంతుని దృష్టిని మరల్చడానికి రాముడు తన ఉంగరాన్ని నేల పగుళ్లలో పడేసి, దానిని తిరిగి తీసుకురావాలని హనుమంతుడిని కోరతాడు.
అప్పుడు హనుమంతుడు పాతాళానికి చేరుకొని ఉంగరం కోసం వెతుకుతాడు. అప్పుడు పాతాళ రాజు హనుమంతునికి ఉంగరాలతో నిండిన ఖజానాను చూపించాడు, అవన్నీ రాముడివి. అది చూసిన హనుమంతుడు నిర్ఘాంతపోయాడు. అప్పుడు పాతాళ రాజు హనుమంతుడికి ఇది రాముడు కావాలనే ఇలా చేసాడు అని చెప్తాడు.
#4 రావణుడి పది తలలు
భూమ్మీద సంచరించిన అత్యంత శక్తివంతమైన జీవులలో ఒకరైన రావణుడిని రామాయణం లో చెడ్డ వ్యక్తిగా చూపించారు. అతడికి 10 తలలు, 20 చేతులు ఉన్నాయని చెప్పబడింది. అతడికి దశముఖ, దశగ్రీవ అని పేర్లు ఉన్నాయి. దాని అర్థం అతని తెలివిని సూచించడం.
రావణుడి పది తలలు ప్రతీకాత్మకంగా పది గ్రంథాలపై పట్టును సూచిస్తాయి. అవి నాలుగు వేదాలు (ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం), 6 శాస్త్రాలు (సాంఖ్యశాస్త్రం, యోగం, న్యాయశాస్త్రం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస).
End of Article