“రాధే శ్యామ్ టీజర్”లో…ఈ 10 ఆసక్తికర విషయాలు గమనించారా.?

“రాధే శ్యామ్ టీజర్”లో…ఈ 10 ఆసక్తికర విషయాలు గమనించారా.?

by Mohana Priya

Ads

బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రభాస్, ఇవాళ తన 42వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ టీజర్ ఇవాళ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే ఒక జ్యోతిష్కుడి (పామిస్ట్) పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో గమనిస్తే కథకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

టీజర్ మొదట్లో చూస్తే ప్రభాస్ ఒకచోట పడుకొని ఉంటారు. కింద నేల మీద వరల్డ్ మ్యాప్ ఉంటుంది.

Unnoticed details in Radhe Shyam teaser

#1 ప్రొడక్షన్ హౌస్ పేర్లు పడేటప్పుడు వెనకాల ప్రభాస్ పోషించిన పాత్ర విక్రమాదిత్య గురించి న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. టైం మ్యాగజిన్ మీద, “భారత దేశ అత్యవసర పరిస్థితి గురించి ముందే పసిగట్టిన వ్యక్తి” అని రాసి ఉంటుంది. అలాగే, “విక్రమాదిత్య నాకు చాలా సహాయం చేశారు. ఆయన వల్ల నేను నా వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను” అని ఎవరో ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన మెసేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి.

Unnoticed details in Radhe Shyam teaser

విక్రమాదిత్య గురించి రాసిన, అలాగే మనకి టీజర్ మొదట్లో ప్రొడక్షన్ హౌస్ పేర్లు పడేటప్పుడు చూపించిన టైం మ్యాగజిన్ ఆర్టికల్ ఇదే.

Unnoticed details in Radhe Shyam teaser

#2 కృష్ణాష్టమి సందర్భంగా రిలీజ్ అయిన స్పెషల్ పోస్టర్ లో పూజా హెగ్డే పియానో వాయిస్తూ ఉంటారు. ఆ పియానో ఇదే.

Unnoticed details in Radhe Shyam teaser

ప్రేమ గురించి నాకు తెలుసు అని ప్రభాస్ అన్నప్పుడు, పియానో మీద ఉన్న ఒక రోజా పువ్వు వెళ్లి నీటిలో పడిపోతుంది. అంటే, ఏదో నీటికి సంబంధించిన ఉపద్రవం వల్ల పూజా హెగ్డే, ప్రభాస్ కి దూరం అవుతారు అని ఇది చూస్తే అర్థమవుతుంది.

Unnoticed details in Radhe Shyam teaser

#3 నెక్స్ట్ షాట్ లో రోజా పువ్వు, గడియారం, కింద కొన్ని బుక్స్, అలాగే రాధాకృష్ణుల బొమ్మ కూడా ఉంటుంది.

Unnoticed details in Radhe Shyam teaser

ఇప్పుడు ఈ కింద ఉన్న షాట్ లో చూస్తే, అదే రాధాకృష్ణుల బొమ్మ మీద రక్తం పడి ఉంటుంది. రెండు ఒకటే అని మనకి ఇది చూస్తే అర్థమైపోతుంది.

Unnoticed details in Radhe Shyam teaser

#4 నెక్స్ట్ షాట్ లో ఒక చెక్క మీద “VA+P” అని రాసి ఉంటాయి. అంటే అందులో “VA” అంటే విక్రమాదిత్య, “P” అంటే ప్రేరణ అని మనం అర్థం చేసుకోవచ్చు.

Unnoticed details in Radhe Shyam teaser

#5 అలాగే ఒక పడవని కూడా ఫోకస్ చేసి చూపిస్తున్నారు.

Unnoticed details in Radhe Shyam teaser

ఇదే ఫోటోలో వెనకాల ఒక వయోలిన్ కూడా కనిపిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపిస్తారు అని సమాచారం.

Unnoticed details in Radhe Shyam teaser

#6 ఈ ఫోటోలో కొంతమంది చేతిగుర్తులు, అలాగే ఒక డబ్బా, అందులో రెండు చేతులలాగా ఉండే మౌల్డ్, ఒక రుద్రాక్షమాల ఉన్నాయి.

Unnoticed details in Radhe Shyam teaser

#7 సినిమాలో రైల్వే స్టేషన్ కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అని కొంతకాలం క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో, అలాగే టీజర్ చూస్తే మనకి అర్థమవుతుంది.

Unnoticed details in Radhe Shyam teaser

టీజర్ లో చూపించినప్పుడు రైల్వే స్టేషన్ లో ఉన్న గడియారంలో 10 గంటల 20 నిమిషాలు ఉన్నప్పుడు క్లాక్ ఆగిపోతుంది.

Unnoticed details in Radhe Shyam teaser

#8 అలాగే ఇక్కడ ప్రభాస్ ఎవరో ఒక అమ్మాయి చేయి పట్టుకుని ఉన్నది కూడా మనం చూడొచ్చు. ఆ చేయి మరి ఎవరిదో కాదు పూజా హెగ్డేది అని మనకి అర్థం అయిపోతుంది.

Unnoticed details in Radhe Shyam teaser

#9 ఇక్కడ ఒక టవర్ పడిపోవడం, భారీగా వర్షం పడుతూ ఉండటం గమనించవచ్చు. ఈ ప్రమాదంలోనే పూజా హెగ్డే, ప్రభాస్ సమస్యలను ఎదుర్కొంటారు అని మనకి దర్శకుడు చెప్పకనే చెప్పారు.

Unnoticed details in Radhe Shyam teaser

#10 కింద ఉన్న ఫోటో ఒకసారి సరిగ్గా గమనించండి. ఇందులో ప్రభాస్ బ్లాక్ సూట్ వేసుకుని ఉన్నారు.

Unnoticed details in Radhe Shyam teaser

ఈ ఫోటో టీజర్ చివరిలో వచ్చే షాట్ లోది. ఇది గమనిస్తే, టీజర్ మొదట్లో ప్రభాస్ మనకి కనిపించిన డ్రెస్ లోనే, లాస్ట్ షాట్ లో కూడా ఉన్నారు అని అర్థం అవుతోంది. అంటే, మనకి ప్రభాస్ మామూలుగా కనిపించిన కొంత సమయంలోనే, ఈ వర్షం సీన్ జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు.

Unnoticed details in Radhe Shyam teaser

ఇవన్నీ మాత్రమే కాకుండా చివరిలో సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ జనవరి 14 అనే క్యాలెండర్ చూపించారు.

Unnoticed details in Radhe Shyam teaser

ఈ సినిమా పోస్టర్స్ గమనించినట్లయితే ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా టైం ట్రావెలింగ్ మీద నడుస్తుంది అని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ అదే నిజమా? ప్రభాస్ నిజమైన డబల్ యాక్షన్ చేస్తున్నారా? ఇందులో ఎంతవరకు నిజం అవుతాయో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like