Ads
మనకి ఎప్పటినుంచో వెస్టర్న్ కల్చర్ అంటే బాగా మోజు.. తినే తిండి , కట్టుకునే బట్ట దగ్గర నుండి ఆఖరుకి టాయిలెట్ కూడా వెస్టర్న్ దే వాడేవరకు..నిజానికి అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది..కాని మన తినే తిండి, ఆచరించే అలవాట్లలో ఆరోగ్యం ఉంటుంది..ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉపాసన కొణిదెల నెటిజన్స్ కి న్యూ ఛాలెంజ్ విసిరారు.. మీరిలా ఐదు నిమిషాలు కూర్చోగలరా అంటూ ప్రశ్నించారు.
Video Advertisement
మోకాళ్ల మీద రెండు చేతులు సపోర్ట్ చేసి కూర్చుని ఉన్న ఫొటోని ట్విటర్లో పోస్టు చేసి “ ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది,కానీ అలా కూర్చోవడం చాలా కష్టం. హైదరాబాద్ లో చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్ట పడతారు .ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో మీరు కనీసం 5 నిమిషాలైనా కూర్చోగలరా ? అని నెటిజన్లను ప్రశ్నించింది. నిజానికి ఇలా కూర్చోవటం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మే 3 తర్వాత ప్రతిరోజూ నేను కూడా ఇలాంటి వ్యామాయం చేసేందుకు ట్రై చేస్తాను” అని తన ట్వీట్లో పేర్కొంది.
ఉపాసన ట్వీట్ చూడగానే చాలామంది వామ్మో అని నోరెళ్లబెట్టారు .మరికొందరు ఉపాసన గట్స్ కి మెచ్చుకుంటున్నారు .వదిన సూపర్ అంటూ రాంచరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఉపాసన సామాజిక సమస్యలపై స్పందించడం ఇది కొత్తేమి కాదు. గతంలో డెంగ్యూ వచ్చినప్పుడైనా, ఇప్పుడు కోవిడ్-19పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంది..వివిధరకాల సామాజిక కార్యక్రమాలకి ముందుంటుంది. హెల్త్ విషయంలో చాలా కాన్షియస్ గా ఉండే ఉపాసన సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోగ్యానికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తుంటుంది.
ఇండియన్ టాయిలెట్ ఉపయోగాలు:
నిజానికి ఉపాసన చెప్పినదాంట్లో నిజం ఉంది. ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఇండియన్ టాయ్ లెట్ లు కనిపించడం లేదు. అందరూ వెస్ట్రన్ వాష్ రూమ్ లను వాడుతున్నారు. ఒకప్పుడు మల విసర్జన కోసం మనం వాడిన పద్దతిలో శాస్త్రీయత ఉంది.అలా కూర్చోవడంలో మన ఆరోగ్యం ఉంది..అది పక్కన పెట్టి మన వాళ్లు సౌకర్యం చూసుకున్నారు. కనీసం ఇలా అయినా కొంచెం సేపు కూర్చుని ఉండగలిగితే వ్యాయామం చేసినట్టు ఉంటుంది.
ఉపాసన ట్వీట్ కి ఒక వ్యక్తి ఇది యోగాలో ఏ ఆసనం మాడమ్ అంటూ ప్రస్తావించారు..నిజానికి యోగాలో ప్రత్యేకంగా ఆసనం అంటూ లేదు…కాని పవన ముక్తాసనం అని ఒకటుంది. ఈ ఆసనంలో పడుకుని కాళ్లు పొట్టలోకి ముడుచుకోవడం వలన, పొట్టలోని కండరాలపై ప్రెషర్ పడి ఆపానవాయువు(గ్యాస్) ఏమన్నా ఉంటే విడుదల అయిపోతుంది. మన ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చోవడం వలన పొట్టపై ప్రెషర్ పడి, మల ద్వారం తెరుచుకుని మల విసర్జన సులభంగా అవుతుంది.
అంతేకాదు ఇండియన్ టాయిలెట్ వలన ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే “వెస్టర్న్ టాయిలెట్లో మనం దానిపై కూర్చోవడం వలన, మన శరీరం నేరుగా టచ్ అయి యూరినల్ ఇన్పెక్షన్ కి ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్లో అలాంటి దానికి ఆస్కారం ఉండదు. అసలే ఇది కరోనా కాలం చాలా శుభ్రత పాటించాల్సిన సమయం వీలైతే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే కనీసం ఉపాసన చెప్పినట్ట ఆ పొజిషన్లో కూర్చొని కాసేపు వ్యాయామం చేయడానికైనా ప్రయత్నించండి.
End of Article