షూటింగ్ సమయంలో “క్లాప్ బోర్డ్” ఎందుకు కొడతారు.? దానికి ఇంత ప్రాముఖ్యత ఉందని చాలామందికి తెలీదు.!

షూటింగ్ సమయంలో “క్లాప్ బోర్డ్” ఎందుకు కొడతారు.? దానికి ఇంత ప్రాముఖ్యత ఉందని చాలామందికి తెలీదు.!

by Mohana Priya

Ads

సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు యాక్షన్, కట్ అనే పదాలతో పాటు ఫాలో అయ్యే ఇంకో ముఖ్యమైనది క్లాప్ సౌండ్. ఒక సీన్ మొదలుపెట్టే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ బోర్డ్ పట్టుకొని క్లాప్  కొట్టడం చూసే ఉంటాం. అసలు క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా? క్లాప్ కొట్టడం వల్ల సినిమా బృందంకి ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

use of clap board in shooting

క్లాప్ బోర్డ్ ని క్లాపర్ బోర్డ్ అని కూడా అంటారు. ఈ క్లాపర్ బోర్డ్ ఎప్పటినుంచో ఉంది. సాధారణంగా అప్పట్లో సినిమాలు తీసేటప్పుడు వాడే కెమెరా సౌండ్ రికార్డ్ చేసేది కాదు. షూట్ చేయడానికి కెమెరా, సౌండ్ రికార్డ్ చేయడానికి ఇంకొక డివైస్ వాడేవారు. ఇప్పటికి కూడా దాదాపు చాలా చోట్ల ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. అలాంటప్పుడు  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో  సీన్ కి తగ్గట్టుగా సౌండ్ సింక్ చేయడానికి ఎడిటర్స్ క్లాప్ టైమింగ్ ఫాలో అవుతారు.

use of clap board in shooting

క్లాప్ కొట్టిన వెంటనే వచ్చే డైలాగ్ చూసుకొని, దానికి రికార్డ్ చేసిన వాయిస్ చూసుకొని సింక్ చేస్తారు. ఇంకొక కారణం ఏంటంటే, సెట్ లో చాలా మంది ఉంటారు. క్లాప్ కొట్టిన వెంటనే అందరూ సీన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం చేసుకొని సైలెంట్ అయిపోతారు.  సినిమాలో చూపించిన ఆర్డర్ లోనే సీన్స్ రికార్డ్ చేయరు. నటుల అవైలబులిటీని బట్టి, లొకేషన్స్ అవన్నీ చూసుకొని షూట్ చేస్తారు. ఫైనల్ కట్ లో సీన్స్ అన్నీ లైన్ గా అటాచ్ చేస్తారు.

use of clap board in shooting

సీన్స్ ఆర్డర్ లో తీయరు కాబట్టి ఏ సీన్ ఎక్కడ రావాలో తెలియక ఎడిటర్ కి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్లాప్ బోర్డ్ మీద ప్రొడక్షన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ పేర్లతో పాటు స్క్రిప్ట్ లో ఆ పర్టిక్యులర్ సీన్ నెంబర్, టేక్ నెంబర్ కూడా ఉంటుంది. దాని ఆధారంగా ఎడిటర్స్ సినిమాను ఎడిట్ చేస్తారు.

use of clap board in shooting

షూటింగ్ సమయంలో వాడే ఇంకొకటి ఎండ్ బోర్డ్. అంటే ఆ రోజు షెడ్యూల్ లో సీన్స్ షూటింగ్ అయిపోయింది అనే దానికి సంకేతంగా క్లాప్ బోర్డ్ ని తిప్పి పట్టుకుంటారు. ఇలా షూటింగ్ సమయంలో వాడే క్లాప్ బోర్డ్ కి షూటింగ్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది.


End of Article

You may also like