కొత్త చెప్పులతో వచ్చే ఈ వైట్ ప్యాకెట్స్ ని పడేస్తున్నారా? ఇక నుంచి దాచుకోండి..ఎందుకంటే..?

కొత్త చెప్పులతో వచ్చే ఈ వైట్ ప్యాకెట్స్ ని పడేస్తున్నారా? ఇక నుంచి దాచుకోండి..ఎందుకంటే..?

by Anudeep

Ads

మీరెపుడైన గమనించారా..? మనం కొత్త చెప్పులు లేదా షూస్ కొన్నప్పుడు వాటితో పాటు లోపల ఒక చిన్న వైట్ ప్యాకెట్ ని పెట్టి ఇస్తారు. సాధారణం గా మనం అవి ఎదో కెమికల్స్ అయి ఉంటాయి అని అనుకుని వాటిని పడేస్తుంటాం. కానీ దాని వలన వచ్చే ఉపయోగాలు తెలుసుకుంటే మీరు వాటిని ఎప్పటికి పడేయరు. ఆ వైట్ ప్యాకెట్ ఎందుకు ఇస్తారో.. దానిని మనం ఎలా ఉపయోగించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

silica gel bag 2

అసలు ఈ వైట్ ప్యాకెట్ లను ఏమని పిలుస్తారో తెలుసా? వీటిని సిలికా జెల్ బాగ్స్ అంటారు. సిలికాన్ డయాక్సైడ్ అనే రసాయనం తో ఈ సిలికా జెల్ బాగ్స్ ని తయారు చేస్తారు. ఇది ఏమి విషపదార్ధం కాదు. తేమను పీల్చుకోవడం లో సిలికా జెల్ అద్భుతం గా పని చేస్తుంది.

అందుకే ఈ రసాయనం తో కూడిన సిలికా జెల్ బాగ్స్ ను చెప్పుల్లోనూ, షూస్ లోను ఉంచుతారు. తద్వారా, చెప్పుల్లో లేదా షూస్ లో ఎప్పటికప్పుడు ఏర్పడే తేమని ఈ బాగ్స్ పీల్చుకుంటాయి. చెప్పులు ఎక్కువ కాలం మన్నిక గా ఉంటాయి. ఈ సిలికా జెల్ బ్యాగ్స్ ను మీరు పడేయక్కర్లేదు. వీటిని మనం రోజువారీ అవసరాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు.

silica gel bag 2

ఎప్పుడైనా పొరపాటున మీ మొబైల్ ఫోన్ నీళ్లలో పడి పోయింది అనుకోండి. అప్పుడు మనం ఏమి చేస్తాం. అన్ని పార్ట్శ్ ఊడతీసి గాలి ఆడేలా చేస్తాం.. పొడిగా అయ్యాక బియ్యం లో ఉంచుతుంటాం. ఫోన్ లో ఉండే తేమను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి సమయం లో, ఈ సిలికా జెల్స్ బ్యాగ్స్ ను ఫోన్ పై ఉంచడం ద్వారా తేమను త్వరగా పోగొట్టోచ్చు.

తేమను పీల్చుకోవడం లో సిలికా జెల్ బ్యాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మేకప్ సామాగ్రి స్టోర్ చేసుకోవడం లో కూడా సిలికా జెల్ బ్యాగ్స్ ఉపయోగపడతాయి. సో, ఇక నుంచి కొత్త చెప్పులు కొన్నప్పుడు ఈ ప్యాకెట్స్ ను పడేయకండి. వాటిని కలెక్ట్ చేసి అవసరం అయినపుడు ఉపయోగించుకోండి.

అలాగే జిమ్ బ్యాగ్స్ లో కూడా ఈ సిలికా జెల్ బ్యాగ్స్ పెట్టొచ్చు. అందులో క్రిములు పెరగకుండా ఈ సిలికా జెల్ బ్యాగ్స్ తోడ్పడతాయి. తద్వారా బ్యాగ్స్ క్లీన్ గా ఉంటాయి.

 


End of Article

You may also like