ఈ 4 సింపుల్ టిప్స్ మీ కార్/బైక్ ఎక్కువ మైలేజీ ఇచ్చేలా చేసుకోండి.. అవేంటంటే?

ఈ 4 సింపుల్ టిప్స్ మీ కార్/బైక్ ఎక్కువ మైలేజీ ఇచ్చేలా చేసుకోండి.. అవేంటంటే?

by Anudeep

Ads

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. దానికి తోడు ట్రాఫిక్ కష్టాలు. ఈ లెక్కన ఎక్కువ సేపు బండి ఇంజిన్ ఆన్ లో ఉంచాల్సి వస్తుంది. అదీ కాకుండా.. పెరిగిన ధరలకు పెట్రోల్ ను ఎక్కువ వాడాలి అంటే మనలో చాలా మందికి మనసొప్పదు.

Video Advertisement

మరి ఏమి చేయాలి..? మన కార్ లేదా బైక్ రెగ్యులర్ గా ఇచ్చే మైలేజి కంటే.. కొంచం ఎక్కువ మైలేజిని ఇచ్చేలా చేసుకోవాలి. మనం కొన్ని విషయాలను తెలుసుకుంటే.. ఇలా చేసుకోవడం సులువైనది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

#1. అవసరమైనప్పుడే క్లచ్ వాడండి:
బండి తోలుతున్నప్పుడు తరచూ క్లచ్ ని ఉపయోగిస్తున్నారా? అయితే.. ఈ అలవాటుని మీరెంత తొందరగా మానేసుకుంటే అంత మంచిది. క్లచ్ ని ఎంత ఎక్కువగా వాడితే.. అంత ఎక్కువ పెట్రోల్ ని వాడాల్సి వస్తుంది. అదే..అవసరమైనప్పుడే క్లచ్ ని వాడడం వలన ఇంధనం ఆదా చేసుకోవచ్చు.

#2. వేగం:
మీరు ఎంత వేగంగా బండిని నడుపుతున్నారు అన్న సంగతి కూడా చెక్ చేసుకోండి. కారు మైలేజి గరిష్ట వేగంపై ఆధారపడి ఉంటుంది. గంటకి ఎనభై నుంచి.. వంద కి.మీ మధ్య కారు నడిపితే ఎక్కువ మైలేజి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే..ఈ వేగం ట్రాఫిక్ రోడ్స్ పై సాధ్యం కాదు. అందుకే మనకి మాములుగా నడుపుతున్నప్పుడు కంటే.. హై వే ల పై నడుపుతున్నప్పుడు ఎక్కువ మైలేజి వస్తుంది.

#3. సర్వీసింగ్:
ఎప్పటికప్పుడు మీ కార్ ని సర్వీసింగ్ కు ఇవ్వడం.. సకాలంలో రిపేర్లను చేయించడం వంటివి చేస్తూ మీ కార్ ను మంచిగా మైంటైన్ చేయాలి. ఇంజిన్లు, గేర్ బాక్స్ లు వంటివి ఉండే వాహనాలకు లూబ్రికేషన్ అవసరం అవుతుంది. సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోతే మైలేజి తగ్గిపోతూ ఉంటుంది. కనీసం ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్ చేయించాలి.

#4. టైర్లలో గాలి:
ఎప్పటికప్పుడు మీ బండి టైర్లలో గాలి ఎంత ఉందొ పరిశీలించుకుంటూ ఉండాలి. కార్ టైర్ లో అవసరం అయిన దాని కంటే తక్కువ గాలి ఉంటె.. అది కూడా మీ బండి మైలేజీపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని గాలి కొట్టించుకోవడం ఉత్తమం.


End of Article

You may also like