ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఈ టిప్స్ తో వాటిని తరిమికొట్టేయండి!

ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఈ టిప్స్ తో వాటిని తరిమికొట్టేయండి!

by Anudeep

Ads

ఇంట్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య చీమలు. ఇవి చూడడానికి చిన్నగానే ఉన్నా… ఇల్లంతా తిరుగుతూ భలే చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఇల్లంతా సర్దడం ఒకెత్తయితే.. వంటిల్లు ఒక్కటీ సర్దడం మరొక ఎత్తు. ఎంత సర్దుకున్నా చీమల బెడద ఉండనే ఉంటుంది. తినే ఆహారపదార్ధాల చుట్టూ ఈ చీమలు చేరి పాడు చేస్తుంటాయి.

Video Advertisement

అందుకే చిన్న చిన్న టిప్స్ తో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈ చీమలను తరిమి కొట్టేయండి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి.

ants 2

ఇంట్లో ఉండే సుద్దముక్క చీమలను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సుద్దముక్కలో ఉండే కాల్షియమ్ కార్బోనేట్ చీమలను ఇరిటేట్ చేస్తుంది. అందుకే చీమలు తిరిగే చోట సుద్దముక్కతో గీతలు గీస్తే చీమలు దూరంగా పారిపోతాయి. ఇక స్వీట్లను చూస్తే వదిలిపెట్టని చీమలు మిరియాలను చూస్తే మాత్రం చిరాకుపడతాయి. అవి తిరిగే చోట నల్ల మిరియాల పొడి చల్లితే చీమలు అక్కడ నుంచి వెళ్లిపోతాయి.

ants 1

అలాగే దాల్చిన చక్క వాసనకు కూడా చీమలు దూరంగా పోతాయి. చీమలు తిరిగే చోట దాల్చిన చక్కను పొడి చేసి ఆ పొడిని చల్లితే చీమలు రాకుండా ఉంటాయి. దాల్చిన చక్క దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇక పసుపు వాసనకి కూడా చీమలు దూరంగా పోతాయి. చీమలు తిరుగుతున్న చోట్ల పసుపుని చల్లితే.. ఆ వాసనకి చీమలు దూరంగా పోతాయి.


End of Article

You may also like