Ads
మనం సిస్టం మీద పని చేస్తున్నపుడు.. సడన్ గా స్ట్రక్ట్ అయినట్లు అనిపించినా, సిస్టం స్లో గా ఉన్నా, ఫస్ట్ మనం చేసే పని ఏమిటంటే రిఫ్రెష్ చేయడం. చెయ్యి కాలితే, వెనక్కి లాగేసుకున్నట్లు.. అదేంటో సిస్టం స్లో అవ్వగానే రిఫ్రెష్ కొట్టేయడం మనకి డిఫాల్ట్ గా అలవాటు అయిపొయింది. కానీ అసలు రిఫ్రెష్ బటన్ అన్న ఆప్షన్ ని ఇచ్చింది సిస్టం స్పీడు పెంచడానికి కాదట. అసలు ఎందుకో ఈ ఆర్టికల్ లో చూడండి..
Video Advertisement
మైక్రోసాఫ్ట్ విండోస్ లేదా విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన, రూపకల్పన చేసిన ఆపరేటింగ్ సిస్టమ్. ఇది గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ప్రపంచంలోని వ్యక్తిగత కంప్యూటర్ మార్కెట్లో 90% పైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటోంది. విండోస్ XP నుంచి, విండోస్ 10 సిస్టం వరకు కామన్ గా ఉండే ఆప్షన్ ఏంటి అంటే రిఫ్రెష్. మౌస్ పైన రైట్ క్లిక్ కొట్టగానే కనిపిస్తుంది. చాలా మంది ఈ బటన్ ని సిస్టం పని తీరుని మెరుగు పరచడానికి, మరింత వేగవంతం చేయడానికి ఇచ్చి ఉంటారని భావిస్తుంటారు. కానీ దీని అసలు ఉపయోగం అది కాదు.
మనం రిఫ్రెష్ బటన్ నొక్కినప్పుడు సిస్టమ్ యొక్క మెమరీ తాజా సమాచారంతో రీలోడ్ అవుతుంది. సరళమైన మాటలలో రిఫ్రెష్ స్క్రీన్ పిక్సెల్‌లో ఉన్న ప్రతిదాన్ని పిక్సెల్ ద్వారా తిరిగి తెచ్చుకుంటుంది. సరికొత్త డేటాను కలెక్ట్ చేసుకుని చూపిస్తుంది. అసలు ఈ రిఫ్రెష్ బటన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే..
- మీ డేటా అప్ డేట్ కానప్పుడు..
- మీరేదయినా కొత్త ఫైల్ ని కాపీ లేదా డిలీట్ చేసినా ఆ ఆదేశం డెస్క్ టాప్ పాటించనపుడు..
- డెస్క్‌టాప్ లేదా ఇతర ఫోల్డర్‌లలో గుర్తించబడిన చిహ్నాలు లేదా ఫైల్‌లు కనిపించ ని సమయం లోను..
- థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా సృష్టించబడిన ఫైల్‌లు ఫోల్డర్‌లో చూపబడనప్పుడు…
- ఫైల్ పేరు మార్చబడినప్పుడు అది క్రొత్త పేరును చూపించనప్పుడు..
- ఏదైనా డిస్ప్లే సెట్టింగ్స్ ను మార్చిన సమయం లోను..
ఈ సందర్భాలలో రిఫ్రెష్ బటన్ ను ఉపయోగించి సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు.
End of Article