మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయికి అన్ని వాళ్ళ నాన్నే. దెబ్బ తగలకుండా బాధలు అనేవి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకొంటూ తన కూతురు ఆడిగినవి అన్ని ఇస్తూ అల్లారు ముద్దు గా పెంచుకున్న ఓ తండ్రి కథ.అందరిలో నా కూతురు ఒకటిగా ఉండాలి అని పెద్ద కాలేజ్ లో చదివిస్తున్నాడు ,అమ్మాయి Engineering Second ఇయర్ చదువుతోంది ఒకరోజు

Video Advertisement

 

 

కూతురు: నాన్న నాకు మంచి మొబైల్ కావాలి,
తండ్రి: ఇప్పుడు నీ దగ్గర ఉంది కదరా మళ్ళీ ఎందుకు,
కూతురు: ఇది ఏం బాగాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మొబైల్స్ వాడుతున్నారు…వాళ్ళ ముందు ఇది బయటికి తీసి వాడాలి అంటే నాకు ఏదోలా ఉంది నాన్న please నాకు ఇంకో మంచి మొబైల్ కొనివ్వండి.

తండ్రి: కొద్దిరోజులు ఆగరా కొనిస్తా. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు..
కూతురు: హా..సరే but త్వరగా తీసివ్వండి నాన్న,
తండ్రి: ఓకే తల్లి తీసిస్తా…

representative image

ఒక రోజు కూతురు సాయంత్రం college నుండి వస్తుంది ఇంట్లో వాళ్ళ నాన్న Bed room లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు. sudden గా కూతురు డోర్ open చేస్తుంది ఆ sound విన్న వాళ్ళ నాన్న రాస్తున్నది ఆపేసి fast గా పక్కనే ఉన్న table డ్రా లో పెడుతూ ఉంటే కూతురు గమనిస్తుంది,
కూతురు :- నాన్న… ఏంటి రాస్తున్నది దాచి పెడుతున్నారు.?
తండ్రి: ఏంలేదు రా office pending వర్క్ రాస్తున్నా,
కూతురు:మరీ నన్నుచూసి ఎందుకు దాచి పెడుతున్నారు,
తండ్రి:ఆఫీస్ వర్క్ లు ఇంట్లో చేయకూడదు. నా కూతురు నాతో ఉన్నంతసేపు తననే చూసుకోవాలి ఇవన్నీ కాదు.

తరువాత ఒక రోజు ::
కూతురు : నాన్న నాకు బైక్ కావాలి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి,
తండ్రి : ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు రా,
కూతురు : పోనీ instalments లో తీసుకొని monthly కడదాం,
తండ్రి :వద్దు రా కట్టలేనపుడు ఎలా తీసుకొంటాం చెప్పు ,
కూతురు:- కనీసం Laptop తీసివ్వండి నాన్న plz,
తండ్రి:- ఇంకొద్దిరోజులు ఆగు..తల్లి ఆ తరువాత నీకేం కావాలి అంటే అది తీసిస్తా..
కూతురు:(అలిగి) ఏంటి నాన్న మీరు పొండి అప్పుడు నాకేం వద్దులెండి..

అంతా బాగుంది అని అనుకొంటున్న టైంలో Sudden గా ఓ రోజు
కూతురు:-(హ్యాపీగా) నాన్న మా college లో Tour..Plan చేశారు.మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్లాలని అనుకొంటున్న నాకు 4000 ఇవ్వండి.
తండ్రి:- month end కద రా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. కాలేజ్ లో టూర్ కి కడతావు తరువాత నీ ఖర్చులకు కూడా 3000 కావాలి.ఉన్నది అంతా ఇప్పుడే వాడేస్తే ఇంక ఇంటి ఖర్చులకు..ఉండదు next time వెల్దువులే..

కూతురు:- (కోపంలో ఏడుస్తూ) మొబైల్ అడిగా…Bike..Laptop అడిగా ప్రతి దానికీ కొద్దిరోజులు ఉండు…డబ్బులు లేవు అన్నారు..సరే అవన్నీ costly వస్తువులు అని Silent అయ్యాను..ఇప్పుడు టూర్ కి కూడా అదే అంటున్నారు.అసలు ఏమైంది మీకు ఇంతకు ముందు ఎప్పుడు నేను ఏమడిగిన కాదనే వారు కాదు అలాంటిది ఇప్పుడు ముందులా లేరు మీరు పూర్తిగా మారిపోయారు.అసలు సంపాదించింది అంతా ఏం చేస్తున్నారు..నాకంటే..నా happiness కంటే మీకు ఇంకేం వద్దు అంటారు. ఇప్పుడు చేస్తోంది ఏంటి…?

fathers day wishes in telugu 2020

fathers day wishes in telugu 2020

తండ్రి: (బాధతో) అలా కాదు నాన్న …
కూతురు:(ఏడుస్తూ)..వద్దు మీరు నాతో మాట్లాడకండి..నాకేం చెప్పకండి..(అని రూమ్ లోకి వెళ్లి door వేస్తుంది) ఆ అమ్మాయి నాన్నతో మాట్లాడి 2 days అవుతుంది…వాళ్ళ నాన్న కూతురు మాట్లాడ లేదని ఆ రోజు నుంచి అన్నం తినకుండ బాధ పడుతూ ఉంటాడు…మూడోరోజు night కూతురు room లో ఉంటే..

తండ్రి:- తల్లి..నీకు ఇష్టమైనవి చేసా అన్నం తిందాం రా రా
కూతురు:- (కోపంతో) నాకు ఏమి వద్దు మీరే తినండి…నా ఇష్టాలన్ని ఎప్పుడో చచ్చిపోయాయి..నాతో మాట్లాడకండి pls..అని(గట్టిగా డోర్ వేసుకుంటుంది)…

కూతురు అన్న మాటలకు మనస్తాపం చెంది..తన రూమ్ కు వెళ్ళి పడుకొంటాడు..మరుసటి రోజు ఉదయం ఎంత time అయినా Door open చేయడు..ఏమి ఇంకా బయటికి రాలేదు ఎప్పుడు ఉదయాన్నే లేసి నన్ను లేపే వారు. ఏమైంది ఈ రోజు అని కూతురికి doubt వచ్చి డోర్ open చేసి చూస్తుంది..నాన్న కదలకుండా అలానే పడుకొని ఉంటాడు.అమ్మాయి మనసులో ఏదో తెలియని భయం నాన్న (chest)చెస్ట్ పైన Draw key ఉంటుంది అది తీసుకొని పక్కనే ఉన్న Table Draw ఓపెన్ చేయగానే అందులో లెటర్ ఉంటుంది.

లెటర్ లో తండ్రి: నాన్న బంగారు… నాకు కొద్దిరోజులు గా Heart problem ఉంది.ఇప్పుడు నాకు నా ప్రాణం కన్నా నీ career important..ఎప్పుడు పోతానో నాకే తెలీదు అందుకే నీ పేరు పైన future LIC ఫండ్స్…పై చదువులు,ఖర్చుల కోసం బ్యాంక్ లో balance, ఈ ఇంటిని నీ పేరు పైకి మార్చాను..ఇంకో ఇల్లు కొన్నా వాటికి సంబంధించిన అన్ని documents ఈ డ్రా(Draw) లొనే ఉన్నాయి. మీ అమ్మ చనిపోయాక మొదటిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకొన్నపుడు నీ చిన్ని పిడికిలితో నా వేలిని పెట్టుకొన్నావ్ అప్పుడే ఆ క్షణం నుంచే నా సుఖాలన్నీ మర్చిపోయా..రా..కేవలం నీ ఆనందమే నా జీవితంగా మార్చుకొన్నా.

Fathers Day

Fathers Day

నీకు ఒక్కరోజు నా చేతులతో అన్నం తినిపించకపోతే నాకు ఆరోజు అంతా ఆకలిగా ఉండదు..తినాలని అనిపించదు నీ సంతోషం కోసం ఎన్ని కష్టాలైన నవ్వుతూ భరించా…ఇంకా నా ప్రాణం పోయే వరకు భరిస్తూనే ఉంటా..ఎందుకంటే నా ప్రాణం..ప్రపంచం..రెండూ నువ్వే.. జాగ్రత్తగా ఉండు తల్లి….నువ్వు బాగా చదువుకొని లైఫ్ లో గొప్పగా బ్రతుకుతుంటే అది చూడాలన్నది మీ నాన్న చివరి కోరిక…..

అమ్మాయి నోటి నుంచి మాట రాలేదు…ఒక్కసారిగా అమ్మాయి కళ్ళలో నీళ్లు గుండె పగిలేలా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ నాన్న గుండెల పై వాలిపోతుంది…మిమ్మల్ని తప్పుగా అనుకున్నా నన్ను క్షమించండి..ఒక్కసారి..లే నాన్న pls..కళ్ళు తెరవండి నన్ను వదిలి వెళ్లకు sorry నాకు మీరు తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న..మీ ప్రేమ నాకు కావాలి pls నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్లకండి..నన్ను వదిలి వెళ్లకు.

ఇక్కడ తెలుసుకోవాల్సింది :

మనకు ఎంత స్థోమత ఉందో ఆ స్థాయిలోనే బ్రతకాలి కాని అంతకు మించి ఎక్కువ ఆశ పడకూడదు..అలాగే..మనల్ని ప్రేమించే మనిషి ఒక్కసారిగా ఎందుకు మారాడు అని ముందుగా అర్థం చేసుకోవాలి కాని తొందరపడి అపార్ధం చేసుకోకూడదు..మనం అనుకొనే అపార్ధాల వల్ల కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది…ఒక మనిషి మన పక్కన ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలిదు ఎప్పుడైతే వాళ్ళు మనకు దూరం అవుతారో అప్పుడే తెలుస్తుంది…తొందర పడి, పంతాలకు, ప్రతీష్టలకు పోయి కన్నవారిని దూరం చేసుకోకండి.సర్వేజన సృజనో భవంతు.

Source :: Facebook