విజయ్ ఆంటోనీ అందరికీ సుపరిచితమే. జీవితంలో ఎన్నో కష్టాలని చూశాడు విజయ్ ఆంటోని. విజయ్ తన ఏళ్ళప్పుడు తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించాడు. విజయ్ తల్లి తన పిల్లల్ని చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టాలు పడ్డారు. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేక పోయినా సరే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు అంటే గొప్ప విషయమే.

Video Advertisement

ఒక పక్క తల్లి ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క పిల్లల్ని చూసుకుంటూ వుండేది. పిల్లల చదువు మానిపించడం ఇష్టం లేక ఆమె ఎన్నో అవస్థలు పడింది. ఒకసారి ఆమె ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వస్తే.. విజయ్ ని హాస్టల్ లో పెట్టి తన చెల్లిని ఆమెతో తీసుకువెళ్ళింది. హాస్టల్లో తల్లి వదిలి వెళ్లిన తర్వాత రెండు రోజులకి హాస్టల్ కి సెలవులు ఇచ్చారు. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.

Also Read:  బీపీతో బాధపడుతున్నారా..? అయితే మందులు లేకుండా ఇలా కంట్రోల్ చేసుకోండి..!

ఆ సమయంలో డబ్బులు లేక పోవడంతో కేవలం అరటి పండ్లు తింటూ ఉన్నాడు. ఇలా చాలా కష్టాలు విజయ్ తన జీవితంలో చూశాడు. ఆ కష్టాలు అన్నింటినీ దాటుకుంటూ ప్రస్తుతం హీరోగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. విజయ్ చాలా సినిమాలు చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుని పాపులర్ అయ్యాడు.

సలీం, పిచైకరన్, సైతాన్, యమన్ మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలానే 2009 కేన్స్ గోల్డెన్ లయన్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్. పాట ద్వారా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే విజయ్ ఆంటోని వివాహం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ఫాతిమా అనే ఒక యువతి రాగా.. ఆమెతో ప్రేమలో పడి 2006లో పెళ్లి చేసుకున్నాడు.

Also Read:  అతిలోక సుందరి ‘శ్రీదేవిని’ పెళ్లి చేసుకోవాలనుకున్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా ? ఎందుకు ఆగిపోయారంటే ?