Ads
హిందువులు జరుపునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున గణపతి జన్మించాడు. ఆ రోజుననే హిందువులు భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని అత్యంత వైభంగా జరుపుకుంటారు.
Video Advertisement
వినాయకచవితి రోజున గణేషుని విగ్రహం పెట్టి, పూజ చేస్తారు. అలా 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఏరోజున వినాయకచవితి జరుపుకుంటారు అనే విషయం పై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఏ తేదీన వినాయకచవితి పండుగ జరువుతారో? వినాయక చవితి వ్రత విధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హిందువులు ఏ శుభ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా, ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా విఘ్నాధిపతి అయిన గణపతికే తొలిపూజను చేస్తారు. ఆ తరువాతనే శుభకార్యాన్ని మొదలుపెడతారు. గణపతి పుట్టినరోజున వినాయక చవితిని హిందువులంతా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది ఏరోజు జరుపుకోవాలో అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే పండితులు సెప్టెంబర్ 7న వినాయక చవితిని జరుపుకోవాలని చెబుతున్నారు.
పండుగ రోజున తెల్లవారజామున లేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం తల స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. ఈశాన్య లేదా ఉత్తర దిశలో పీటకు పసుపు రాసి పెట్టాలి. ఒక ప్లేట్ లో బియ్యం పోసి, దాని పై తమలపాకులు పెట్టాలి. ఆ తరువాత అగరువత్తులు వెలిగించి, దీపారాధన చేసి,ఈ మంత్రాన్ని చదువుతూ, పూజను మొదలుపెట్టాలి.
‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’
ఆ తరువాత పీట మీద గణపతి విగ్రహాన్ని పెట్టి, పాలవెల్లికి పసుపు రాసి, బొట్టు పెట్టాలి. గణపతి విగ్రహం తలపై వచ్చేట్టుగా వేలాడకట్టాలి. పత్రి వేసి నాలుగుదిక్కులా పళ్లతో, మొక్కజొన్న కంకులతో అలంకరించాలి. నైవేద్యంగా ఉండ్రాళ్లు, పాయసం, కుడుములు, మోదకులు, జిల్లెడుకాయలు, గారెలు, పులిహోర వంటి పిండివంటలు రెడీ చేసుకోవాలి. ఇత్తడి లేదా రాగి పాత్రకు పసుపు రాసి, నీళ్లువేసి, పైన కొబ్బరికాయ, జాకెట్టు ముక్కను ఉంచి కలశం పెట్టాలి.
పూజా విధానం..
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |
దీపారాధనం
(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)
దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||
భూతోచ్ఛాటనం
(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |
ప్రాణాయామం
(ప్రాణాయామం చేయండి)
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
సంకల్పం
(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ శోభకృతు (2023) నామ సంవత్సరే ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్య ఆయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం తిథౌ ___ వాసరే ___ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (మమ ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ||
|| వినాయక పూజా ప్రారంభః ||
ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||
ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |
అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |
పాద్యం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |
ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |
అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |
అథాంగపూజా
ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
ఓం మహోత్తమాయ నమః | మేఢ్రం పూజయామి |
ఓం నాథాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
ఓం స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ నమః | హస్తౌ పూజయామి (చేతులను) |
ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
ఓం శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి (చెవులను) |
ఓం ఫాలచంద్రాయనమః | లలాటం పూజయామి (నుదురును) |
ఓం నాగాభరణాయనమః | నాసికాం పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |
ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు)
ఓం ఉమాపుత్రాయ నమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయ నమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయ నమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (గరిక) |
ఓం ధూమకేతవే నమః | ధత్తూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయ నమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయ నమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయ నమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయ నమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధూరాయ నమః | సింధువార పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయ నమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయ నమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజత్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |
ఏకవింశతి పుష్ప పూజ – (21 పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః | ధత్తూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |
అష్టోత్తరశతనామ పూజ
శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ | (అష్టోత్రం చదవండి)
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |
నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |
నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |
ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |
రాజోపచార పూజా
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే న
మః | చామరైర్వీజయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
వినాయక వ్రత కథ:
మున్ను నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.
గజాసుర వృత్తాంతం
భక్తుడైన గజాసురుడు పరమశివుడిని తన ఉదరం లో ఉంచుకుంటాడు కదా.. అతనిని విడిపించడానికి విష్ణువు గంగిరెద్దు నాటకం ఆడతాడు. ఎట్టకేలకు గజాననుడు కూడా శివుడిని విడిచిపెట్టాడు ఒప్పుకుంటాడు. ఐతే.. ఈ విషయం తెలిసిన పార్వతి చాలా సంతోషిస్తుంది. భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
వినాయకోత్పత్తి
స్నానానికి వెళ్ళబోతూ.. పసుపు ముద్దతో వినాయకుడిని చేసి ఒక చోట ఉంచుతుంది. తాను వచ్చే వరకు కాపలా గా ఉండమని చెబుతుంది. ఆ సమయం లోనే శివుడు ఇంటికి వస్తాడు. ఐతే ఆ బాలుడు శివుడిని అడ్డగిస్తాడు. దీనితో శివుడు కోపగించి వినాయకుని శిరస్సుని ఖండిస్తాడు. ఆ తరువాత పార్వతి దేవి వచ్చి జరిగినది తెలుసుకుని దుఃఖిస్తుంది. తన బాలుడిని తెచ్చి ఇవ్వాలని కోరుతుంది. దీనితో.. పరమేశ్వరుడు బాధపడి.. తాను బయటకు రావడం వలన చనిపోయిన గజాసురుని తలని తీసుకొచ్చి వినాయకుడికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. అందుకే వినాయకుడిని గజాననుడు అని కూడా పిలుస్తారు.
విఘ్నేశాధిపత్యము
ఆ తరువాత కుమారస్వామి కూడా జన్మిస్తారు. వీరిద్దరూ చక్కగా ఉండేవారు. ఐతే.. సైన్యాధిపతి గా ఎవరిని నియమించాలి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనితో శివుడు ఆ కుమారులిద్దరికి ఓ పరీక్ష పెడతాడు. ఎవరైతే.. భూలోకం లో అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో.. వారే సైన్యాధ్యక్ష పదవి కి అర్హులని శివుడు చెబుతాడు. శివుడు చెప్పగానే.. కుమారస్వామి తన నెమలి వాహనం పై వెళ్ళిపోతాడు. ఐతే.. వినాయకుడు దుఃఖించి స్వామీ.. నా పరిస్థితి తెలిసినా ఇట్లు ఆనతి ఇవ్వడం తగునా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శివుడు తరుణోపాయం చెబుతాడు. తనను ధ్యానిస్తూ.. తల్లి తండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయమని చెబుతాడు. గణపతి అలానే తల్లితండ్రులను ధ్యానిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు.
అక్కడ కుమారస్వామి గంగ, యమునా, నర్మదా వంటి నదులలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు.. అప్పటికే వినాయకుడు స్నానం చేసి ఎదురు వస్తున్నట్లు కనిపించేది. అన్నీ నదులలోను స్నానం పూర్తి చేసుకున్న కుమారస్వామి తిరిగి కైలాసం చేరేసరికి గణపతి అప్పటికే అక్కడికి వచ్చేసినట్లు కనిపిస్తాడు. దీనితో అన్నగారి వద్దకు వచ్చి.. అన్నయ్యా.. మీ శక్తిని తక్కువ గా అంచనా వేసాను.. ఈ పదవి కి మీరే అర్హులని సెలవిస్తాడు. ఇక పరమేశ్వరుడు వినాయకుడిని విఘ్నాధిపతి గా నియమిస్తాడు.
ఋషిపత్నులకు నిరాపనింద కలుగుట
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని నుపసంహరింపు”మని ప్రార్థింప
పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి ముద్దాడి “ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము
ద్వాపర యుగం లో.. ద్వారకలో శ్రీ కృష్ణుడు వినాయక చవితి రోజున అందరికి చాటింపు వేయించాడు. ఈరోజు గణేష్ చతుర్థి కావున ఎవరు చంద్రుని చూడవద్దని చెప్పాడు. ఆరోజు సాయం కాలానికి ఆవునుంచి పాలు పితుకుతు.. పాలల్లో చంద్రుని చూస్తాడు. అయ్యో అందరికి చెప్పి.. నేనే చూసానే.. ఇప్పుడు ఎలాంటి నిందలు వస్తాయో అని శ్రీ కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు.
ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.
వెంటనే సత్రాజిత్తు వద్దకు వెళ్లి.. శ్యమంతక మణి తన వద్ద లేదని.. అది ఏమైందో తెలుసుకుని.. ఆధారాలతో సహా చూపిస్తానని శపధం చేస్తాడు. కృష్ణుడు కూడా అడవికి వెళ్లి సత్రాజిత్తు తమ్ముడి కోసం వెతుకుతాడు. ఆ మార్గం మధ్యలో సత్రాజిత్తు కళేబరం, ఆ పక్కనే ఓ సింహం కళేబరం, కొద్దీ గా దూరం గా ఎలుగుబంటి అడుగు జాడలు కనిపిస్తాయి. మణి కోసమే సింహం దాడి చేసి ఉంటుందని.. ఆ సింహాన్ని, సత్రాజిత్తుని ఎలుగుబంటి చంపేసి మణిని తీసుకుని వెళ్ళుంటుందని కృష్ణుడు అర్ధం చేసుకుంటాడు. ఆ ఎలుగు బంటి అడుగులు పడిన వైపుగా వెళతాడు.
అక్కడ ఉయ్యాలకు ఈ మణి కట్టబడి ఉంటుంది. ఆ ఉయ్యాలలో ఓ పాపాయి ఉంటుంది. ఈ మణిని చూసి ఆడుకుంటూ ఉంటుంది. కృష్ణుడు అక్కడకు వెళ్లి మణిని తీసుకుంటాడు. దానితో ఆ పిల్ల ఏడవడం మొదలుపెడుతుంది. వెంటనే ఎలుగుబంటి రూపం లో ఉన్న జాంబవంతుడు అక్కడకు వచ్చి ఆ మణి కోసం కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం లో జాంబవంతుడు ఓడిపోతాడు. తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం చేసి.. ఆ మణిని కూడా కృష్ణుడికే ఇచ్చేస్తాడు.
ఆ తరువాత కృష్ణుడు ఆ మణిని తీసుకుని సత్రాజిత్తు వద్దకు వస్తాడు. జరిగినదంతా వివరిస్తాడు. కృష్ణుడిపై అట్టి నీలాపనిందను వేసినందుకు బాధపడి.. ఆ మణి నాకు వద్దు అంటూ కృష్ణుడిని ఉంచుకోమని ఇచ్చేస్తాడు. తన కుమార్తె ఐన సత్య భామ ను కూడా కృష్ణుడికే ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఆ తరువాత సాధుపుంగవులంతా.. కృష్ణుడి వద్దకు చేరి.. అయ్యా మీరు సమర్థులు కనుక మీ పై వచ్చిన నీలాపనిందను పోగొట్టుకున్నారు. మరి మాలాంటి సామాన్యులకు ఏదీ దారి అని అడుగుతారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఎవరైతే వినాయక చతుర్థి రోజు వినాయకుడిని పూజించి.. ఈ కథను చదువుకుంటారో.. వారికి ఎటువంటి నీలాపనిందలు ఉండవు అని కృష్ణుడు సెలవిస్తాడు. అప్పటి నుంచి వినాయక చతుర్థి రోజు పూజ చేసుకుని కథ చదువుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.
గమనిక : చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||
సర్వేజనాస్సుఖినోభవంతు |
Also Read: “కృష్ణుడి” ద్వారకా ఉందనడానికి సాక్షాలు ఇవే..!
End of Article