“ఈ బాధలు ఎవరు అర్ధం చేసుకుంటారు..” అంటూ మెన్స్ డే రోజు వాట్సాప్ లో వైరల్ అయిన మెసేజ్…!

“ఈ బాధలు ఎవరు అర్ధం చేసుకుంటారు..” అంటూ మెన్స్ డే రోజు వాట్సాప్ లో వైరల్ అయిన మెసేజ్…!

by Anudeep

Ads

నిన్న మెన్స్ డే అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉమెన్స్ డే రోజు కనిపించే హడావిడి మెన్స్ డే రోజు కనిపించదు. అబ్బాయిలు కూడా.. మెన్స్ డే రోజు కనీసం విష్ కూడా చేయలేదు అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలా.. ఆ విషయమై సోషల్ మీడియాలో చాలానే మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. ఆ హవా వాట్సాప్ లో కూడా కొనసాగింది. మా మగాళ్ల బాధలు ఎవరు పట్టించుకుంటారు.. అంటూ మెన్స్ డే రోజు వాట్సాప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

whatsapp message 1

“ఈ దేవుడు చాలా దుర్మార్గుడు.. ఈరోజు మగాళ్ల దినోత్సవం ఉందని సంతోషించేలోపే మరుగుదొడ్ల దినోత్సవం కూడా ఉందని గుర్తు చేస్తాడు.. ఏదోలే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. ఈరోజు కార్తీక పౌర్ణమి కూడా.. మా మగవాళ్ల బాధలు ఎవరికి అర్ధం అవుతాయి..? మాకెవరు శుభాకాంక్షలు చెబుతారు.. ఏడవలేక నవ్వుతూ..మాకు మేమే విషెస్ చెప్పుకుంటూ ఉంటాం..

whatsapp message 2

అలిగితే ఆడపిల్లవా అంటూ హేళన చేస్తారు.. ఏడిస్తే, ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటూ లేనిపోని సూక్తులు చెబుతారు. సరదాగా బయటకు వెళ్తే..తిరుగుబోతు గా ముద్ర వేస్తారు. ఏదైనా బాధ వస్తే.. మరిచిపోదామని మందు తాగితే తాగుబోతు అంటారు. అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అంటారు.. భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడు అని ముద్ర వేస్తారు.

చెల్లె, అక్క, బావ, బాబాయ్ లు చెప్పే మాటలు వింటే చేతకాని చవటగా చూస్తారు. ఫ్రెండ్స్ తో తిరిగితే జులాయి అంటారు. ఎక్కువ మాట్లాడితే పోకిరి అంటారు. మాట్లాడకపోతే పొగరు అంటారు.. ఏమి చేసినా.. ఏమి మాట్లాడినా తప్పు పట్టే లోకమే ఇది. ఇంట్లోనూ, బయటా చెప్పుకోలేని బాధలు ఉన్నా.. అన్నిటిని భరిస్తూ తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, కొడుకుగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా ఇలా అందరికి ప్రేమను పంచుతూ త్యాగాలు చేస్తున్న “మగ” ధీరుల్లారా..

 

ప్రియురాలు-భార్యాభాధిత,అప్పుబాధిత, జనబాధిత, విధి వంచిత… శోకాతప్త హృదయుల్లారా..

  • ఏ బాధ లేకుండా ఉన్న మహార్జాతకులారా..
  • బాధలు ఉన్నా ఏడవలేక నిగ్రహించుకున్న నిస్సహాయా పురుషుల్లారా..
  • బ్రతుకు సమరంలో చితికిపోయిన గరళకంఠుల్లారా…
  • సమస్యలతో కుస్తీపట్టే మల్లయోధుల్లారా.
  • కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడే జీతంలేని నిరంతర శ్రామికుల్లారా…

whatsapp message 4

మీకంటూ ఓ రోజుని కేటాయించారు.. ఈ రోజైనా…అన్నీ…మరిచి, నీకోసం కాసేపైనా సమయం గడుపుతావని ఆశిస్తూ.. “అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు… ”

“సర్వే ‘మగ’ జనా సుఖినోభవంతు…”

Source: Whatsapp


End of Article

You may also like