విరాట్ కోహ్లీ తన టీమ్ మేట్స్ తో అన్నమాటని నిజం చేసి చూపించారు. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ మొదలయ్యే ముందు “ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి” అని సహచరులతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అన్నట్టుగానే ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. చివరి రోజు భారత జట్టు టెయిల్ ఎండర్స్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) దూసుకెళ్లారు.kohli motivational speech

దాంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ని 298 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. ఇంగ్లాండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాలి. మైదానంలోకి దిగే ముందు విరాట్ కోహ్లీ తన సహచరులతో మాట్లాడి అందరిలో స్ఫూర్తిని రగిలించారు. టీమిండియా బౌలర్ల ఆటకి ఇంగ్లండ్ కేవలం ఒక్క పరుగుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. భారత పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ నిలదొక్కుకోలేక వెనుదిరిగారు.

ఆట ముగియడానికి 9.1 ఓవర్లు ఉన్నప్పుడు ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండడంతో మ్యాచ్ డ్రా అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాబిన్సన్ (9) ని బూమ్రా  అవుట్ చేసి టీమిండియా గెలుపుకు దారి వేశారు. ఒకే ఓవర్ లో బట్లర్‌ (25), అండర్సన్‌ (0) లను పెవిలియన్ కి పంపించిన సిరాజ్ గెలుపు లాంఛనాన్ని ముగించారు. ఇందులో భారత పేసర్లు ఖాతాలో 19 వికెట్లు పడ్డాయి.

watch video :