ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో డైట్ ప్లాన్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ఇవేమి సహకరించక బరువు తగ్గలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి శరీర తత్వానికి సరిపడే వ్యాయామం చేయాలి. అందుకు తగ్గ డైట్ ను కూడా ఎంచుకోవాలి.

fennel seeds

ఈ రెండింటితో పాటు చిన్న చిన్న చిట్కాలను కూడా పాటిస్తే.. బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదు. సోంపు అందుకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పోషకాలు కొవ్వు కరిగించడం లో ఎంతగానో శరీరానికి సాయం చేస్తాయి. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ సోంపు నానబెట్టిన నీటిని తీసుకుంటే.. కడుపు నిండిపోయిన భావన వస్తుంది. తద్వారా భోజనం మితం గా తీసుకుంటారు. ఈ నీరు ఉదయాన్నే తాగడం వలన జీవక్రియ పెరిగి మలబద్ధకం సమస్య మాయమవుతుంది. అలాగే భోజనం చేయగానే.. సోంపు తీసుకోవడం వలన మీరు తీసుకున్న ఆహరం త్వరగా జీర్ణమవుతుంది.