Ads
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్య ఘట్టం. పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. కానీ కాలం ఎవరి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు.
Video Advertisement
పెళ్లి తర్వాత జీవిత భాగస్వాముల మధ్య అనేక సమస్యలు తలెత్తవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగిపోతే సంసారం సుఖంగా సాగుతుంది. అలా కాదని సమస్యలకు తలవంచితే అది విడాకుల వరకు దారి తీస్తుంది.
కొందరు భార్య భర్తలు ఈ మధ్య సరైన అన్యోన్యత లేకపోవడం వల్ల ఒకరికి ఒకరు విడాకులతో దూరమవుతారు. ఇలా విడాకులతో దూరమైన వారిలో కొందరు ఒంటరిగానే జీవిస్తూ ఉంటారు. మరి కొందరు మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇలా రెండో వివాహం చేసుకున్న వారిలో అనేక సమస్యలు ఉంటాయని, సరైన జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
మరి విడాకులు తీసుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.. రెండో వివాహం చేసుకున్న వారిలో ఏ చిన్న గొడవ జరిగినా ప్రస్తుత జీవితభాగస్వామి తన మొదట వివాహం చేసుకున్నా భర్త లేక భార్య గురించి గుర్తు చేస్తారట. ప్రతి చిన్న తప్పును పాయింట్ అవుట్ చేస్తూ ఈ కారణం వల్లే నిన్ను నీ మొదటి భాగస్వామి వదిలేసి ఉంటారు అని అవమానించే విధంగా మాట్లాడతారట.
తాను ముందు జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటో ముందే వివాహం చేసుకోబోయేవారికి వివరంగా తెలియజేయడం మంచిదట. ఇలాంటి సమయంలోనే ఇది చాలా ఓర్పుతో ఉండాలని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు.
End of Article