Ads
మన చుట్టూ ఉండేవి, మనం రోజు చూస్తూ ఉండేవి మనకి అన్ని తెలిసినవే అని అనుకుంటూ ఉంటాం. కానీ నిశితంగా గమనిస్తే మనకి తెలియని ఎన్నో విషయాలు మన చుట్టూనే ఉంటాయి. మనం గమనిస్తూ ఉన్న ప్రతిసారీ మనకి ఓ కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది.
Video Advertisement
మీరెప్పుడైనా గమనించారా..? మనం బ్రాండెడ్ షర్ట్స్ ని కొన్నప్పుడు ఆ షర్ట్ ల కాలర్స్ కి రకరకాల ట్యాగ్స్ ఉంటాయి. కొన్ని పాకెట్స్ లాంటివి కూడా అటాచ్ అయ్యి ఉంటాయి.
అయితే.. మనం కొత్త షర్ట్ కొనుక్కుని, ఇంటికి రాగానే చేసే పని ఏంటంటే.. ఈ టాగ్స్ అన్నిటిని కట్ చేసి, పక్కన పడేయడం.. ఆ తర్వాత వాటిని వేసుకుని మురిసిపోవడం. కానీ.. ఆ టాగ్స్ తో పాటు ఆ కాలర్ కి ఏమేమి తగిలించి ఉన్నాయి అనే విషయాన్నీ మీరెప్పుడైనా గమనించారా..?
వాటికి ఈ ఫొటోలో చూపించేట్లు ఉండే చిన్న పాకెట్స్ ఉంటాయి. అవి చాలా స్టిఫ్ గా ఉంటాయి. వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటో తెలిస్తే.. వాటినెప్పుడు పడేయరు. వీటిని కాలర్ కి రెండు వైపులా లోపల పెట్టించుకుంటే.. మీ కాలర్ నలిగిపోకుండా స్టిఫ్ గా ఉంటుంది. మనం ఎన్ని సార్లు షర్ట్స్ కొనుక్కున్న కొంతకాలానికి కాలర్ నలిగిపోయి ఉంటుంది. కానీ.. వీటిని కాలర్ లో పెట్టుకోవడం వలన మీ కాలర్ నలిగిపోకుండా స్టిఫ్ గా ఉంటుంది. ఇంకెప్పుడైనా కొత్త షర్ట్స్ కొనుక్కున్నప్పుడు గమనించి చూడండి. ఇలాంటి పాకెట్స్ ని ఇస్తే.. వాటిని పడేయకుండా మీ కాలర్ లో పెట్టించుకోండి. మీ కాలర్ చాలా కలం వరకు స్టిఫ్ గా ఉంటుంది.
End of Article