Ads
చాలా స్మార్ట్ ఫోన్ల డిజైన్లు చాలా క్లాసీగా ఉంటాయి. స్మూత్ గా ప్లెయిన్ గా ఉంటాయి. అయితే.. కొన్ని మొబైల్స్ వెనకాల మాత్రం ఇలా ఫొటోలో చూపించిన విధంగా గీతలు ఉంటాయి. చాలా మంది ఇవి కూడా డిజైన్ లో భాగమేనని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు.
Video Advertisement
మరి ఇలా గీతలు ఎందుకు ఉంటాయి..? అన్న సందేహం కలుగుతుందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. కొన్ని మొబైల్ ఫోన్స్ వెనకాల ఈ లైన్స్ ఎందుకు ఉంటాయో తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కంటే.. చాలా వరకు ఐ ఫోన్స్ వెనక మాత్రమే ఇలాంటి గీతలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి అవి గీతలు మాత్రమే కాదు. వాటిని ఆంటెన్నా లైన్స్ లేదా ఆంటెన్నా ఛానెల్స్ అని అంటారు. ఫోన్ నెట్‌వర్క్‌తో కమ్యూనికేట్ చేసే విషయంలో ఈ ఆంటెన్నా లైన్స్ కీలక పాత్రని పోషిస్తాయి.
ఈ ఏరియల్స్ హ్యాండ్‌సెట్ లోపల ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఫోన్ యొక్క ఆల్-మెటల్ నిర్మాణం రేడియో తరంగాల నుండి తప్పించుకోలేదు. అందుకే రేడియో తరంగాలను గ్రహించడానికి వీలుగా ఈ లైన్స్ ను బ్యాక్ సైడ్ ఏర్పాటు చేస్తారు. తద్వారా యాంటెనాలు సమాచారాన్ని పంపడం మరియు స్వీకరించడం చేస్తాయి.
అయితే ఇలా అన్ని ఫోన్లకు ఆంటెన్నా లైన్స్ ను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా లైన్స్ ప్లాస్టిక్ బ్యాక్ కేస్ తోనే వస్తాయి. ప్లాస్టిక్ నుంచి ఆంటెన్నా రేస్ ఈజీగానే పాస్ అవుతాయి. కానీ ఐఫోన్ వంటి కొన్ని ఫోన్లలో మెటల్ కేస్ వస్తుంది. దీనిద్వారా రేడియో తరంగాలు పాస్ అవడం కష్టం అవుతుంది. అందుకే ఇలాంటి ఫోన్లకు ఆంటెన్నా లైన్స్ ను ప్రత్యేకంగా ఇస్తుంటారు.
End of Article