తొలకరి జల్లులు మొదలవడం తోనే వాతావరణం లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితం గా పలు అనారోగ్యాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ సీజన్ లోనే ఎక్కువ గా జ్వరాలు, ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులను ఎదుర్కోవచ్చు.

foods 1

  • వర్షాలు ఎక్కువగా పడుతుండడం వలన చల్లదనం కారణం గా ఎక్కువ గా దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అందుకే ఎక్కువ గా వర్షం లో తడవకండి.
  • అలాగే దుమ్ము , ధూళి ఎక్కువ గా ఉండే ప్రాంతాలలోకి వెళ్లాల్సి వచ్చినపుడు ఆ దుమ్ము వలన వైరస్ లు దరిచేరకుండా ముక్కుకు మాస్క్ లాంటివి ధరించడం ఉత్తమం. అలాగే దోమల వలన కూడా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకోవడం, దోమల తెర ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

foods 2

  • ఈ సీజన్ లో ఎక్కువ మందికి టైఫాయిడ్ వస్తూ ఉంటుంది. కలుషితమైన ఆహరం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తగ్గించడం ఉత్తమం.
  • అలాగే, చల్లటి ఆహార పదార్ధాలు, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను తినకుండా ఉండడమే మంచిది. నీటిని కాచుకుని తాగడం, వేపుళ్లని తగ్గించి ఉడికించిన పదార్ధాలను తీసుకోవడం మంచిది.

foods 3

  • మాంసాహారం తినేవారు కూడా బాగా కడగడం, ఉడికించడం వంటివి చేయాలి. సరిగ్గా వండని మాంసాహారం ఆనారోగ్య హేతువు. అందుకే ఈ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • బయట ఆహరం తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆహరం పడకపోతే విరేచనాలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.