Ads
తెలుగు సినిమాకి కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన నటుడు రావుగోపాలరావు. ఆయన చేసే విలక్షణ పాత్రలో మరొకరిని ఊహించుకోలేము. అంత గొప్పగా ఉంటుంది ఆయన నటన. ఎన్నో విభిన్న పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందారు.
Video Advertisement
మొదటిలో రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటిలో చిన్నచిన్న అవకాశాలతో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన రావు గోపాలరావు గారు, నెమ్మదిగా మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుని ఒక ఉన్నత నటుడిగా ఎదిగారు. ఆయన సినీ వారసుడు గా రావు రమేష్ గారు ఇండస్ట్రీ లో నటిస్తున్నారు.
రావు గోపాల్ రావు గారు జనవరి 14, 1937న కాకినాడ సమీపంలోని గంగపల్లిలో జన్మించారు. అయితే ఇప్పటి వరకు తెలిసింది మాత్రం బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటించారు. ఈ చిత్రంలో మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలి అనే రావు గోపాల్ రావు గారు చెప్పిన డైలాగు ఆయన కెరియర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ఆయన తన కెరియర్ లో వెనుదిరిగి చూడలేదు.
సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నత స్థానానికి అందుకొన్నారు రావుగోపాలరావు. విలనిజానికి పెట్టింది పేరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంత పెద్ద నటుడు ఆర్థికంగా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.
అందర్నీ గుడ్డిగా నమ్మి ఆర్థిక సహాయం చేయడం ద్వారా తన చివరి రోజుల్లో అనారోగ్యంతో చికిత్సకు కూడా డబ్బులు లేని గడ్డు కాలాన్ని గడిపారు. తన దగ్గర ఉన్న కాస్త డబ్బును కూడా చికిత్స ఖర్చు పెట్టేశారు.
చికిత్స తీసుకుంటూనే చెన్నైలోనే ఆగస్టు 13, 1994న రావు గోపాల్ రావు గారు మరణించారు. ఆయన మరణానంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి జరిగిన ఏర్పాటు సమయంలో ఎంతో మంది పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులతో పరిచయం ఉన్నప్పటికీని, ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించినకపోవడం గమనార్హం.
ఆయనకు బాగా సన్నిహితులైన అల్లు రామలింగయ్య, రేలంగి నరసింహారావు, నిర్మాత జై కృష్ణ, పి. ఎల్ నారాయణ మరియు కొంతమంది తమిళ మిత్రులు మాత్రమే రావు గోపాలరావు అంత్యక్రియలకు పాల్గొన్నారు. ఇంత గొప్ప నటుడికి సాధారణ వ్యక్తిలా అంత్యక్రియలు జరగడం బాధాకరమని ఆయన తమిళ మిత్రులు విచారం వ్యక్తం చేశారట.
రావు గోపాలరావు మరణించే సమయానికి (1994లో) సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. రావు గోపాల్ రావు గారి అంతక్రియలు చెన్నై లో జరగడం వల్ల సినీ ప్రముఖులు ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు అనే వాదన వినిపిస్తోంది.
Also Read:
ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున మాంసం తినకూడదు..! ఎందుకో తెలుసా..?
End of Article