జబర్దస్త్ నరేష్ కు ప్రమాదం జరిగిందా..? అసలు క్యాష్ ప్రోగ్రాం లో ఏమి జరిగింది..?

జబర్దస్త్ నరేష్ కు ప్రమాదం జరిగిందా..? అసలు క్యాష్ ప్రోగ్రాం లో ఏమి జరిగింది..?

by Anudeep

Ads

జబర్దస్త్ షో లో నరేష్ పంచులకు కామెడీ టైమింగ్ కి క్రేజ్ ఎక్కువన్న సంగతి మనకు తెలుసు. తన కామెడీతో నిజంగా జనాల్ని కడుపుబ్బా నవ్విస్తాడు నరేష్. అల్లరి నరేష్ వయసు 22 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు. చిన్నతనం నుంచి ఎదుగుదల లోపం కారణంగా నరేష్ చూడడానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తారు.

Video Advertisement

జబర్దస్త్ కి వచ్చాక తన కామెడీ టైమింగ్ తో నరేష్ చాలా పాపులర్ అయ్యారు. తొలుత డాన్సర్ గా వచ్చిన నరేష్ జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టిగా ఉండడమే మన నరేష్ కు ప్లస్ పాయింట్ అయ్యింది.

పిట్ట కొంచం కూత ఘనం అన్న టైపులో నరేష్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. నరేష్ వేసే పంచ్ లు, సెటైర్లు ఓ రేంజ్ లో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాయి. సెట్ మీద అడుగు పెట్టాడు అంటే పంచ్ పడాల్సిందే. జడ్జి రోజా మీద కూడా పంచ్ లు వేస్తూనే ఉంటాడు. తాజాగా క్యాష్ ప్రోగ్రాంలో నరేష్ పార్టిసిపేట్ చేసాడు. ఇక్కడ కూడా విపరీతంగా అల్లరి చేసాడని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఏకంగా యాంకర్ సుమకే రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసాడు. అది చూసిన సుమ.. “మా ఆయన నిన్ను చూస్తే.. ఇక్కడే పాతేసి నీ సమాధిపై ఆ రోజా పువ్వుని పెడతాడు..” అని సుమ కూడా సెటైర్ వేసింది.

మీరు లవ్ చేయకపోతే.. ఇక్కడ నుంచి దూకేస్తా అంటూ సరదాగా ఆటపట్టించాడు. చివరి రౌండ్ జరుగుతున్న టైంలో నిజంగానే కాలు జారిపడిపోయాడు. అంతలోనే అంబులెన్సు సౌండ్ కూడా వినిపిస్తోంది. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు అందరిని కలవరపెడుతోంది. ఇదంతా సస్పెన్స్ కోసం అయ్యుంటుందని… ఇలాంటివి చాలానే చూసాముగా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. నిజంగా ఏమి జరిగింది అనేది ఫుల్ ఎపిసోడ్ వస్తే తప్ప తెలియదు.

Watch Video:


End of Article

You may also like