చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. సినిమా సినిమాకి నటన పరంగా, డాన్స్ పరంగా తనని తాను మెరుగు పరుచుకుంటూ వస్తున్నారు.

Video Advertisement

ఒక సమయంలో వరుస ఫ్లాప్ లు చూసిన ఎన్టీఆర్, ఆ తర్వాత రూట్ మార్చి కొత్తదనం ఉన్న సినిమాలని, తన పాత్రలో కూడా కొత్తదనం ఉన్న కథలని ఎంచుకుంటున్నారు. టెంపర్ తర్వాత నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, ఎన్నో మంచి పాత్రలు పోషిస్తూ, గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.

Jr Ntr Response on TDP

ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చర్చల్లో నిలిచిన విషయం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితులు, బంధువులు అందరూ కూడా చంద్రబాబుని కలిసి వస్తున్నారు.

Jr Ntr in Devara

ఎన్టీఆర్ కూడా చంద్రబాబు బంధువు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయం మీద ఎన్టీఆర్ అసలు స్పందించకపోవడం అనేది చర్చనీయాంశమైన విషయం అయ్యింది. చాలా మంది హీరోలు ఈ విషయం మీద స్పందించలేదు. అది వేరే విషయం. కానీ బంధువు అయినా కూడా ఎన్టీఆర్ ఎందుకు అసలు మాట్లాడలేదు అని అందరూ అంటున్నారు. సోషల్ మీడియా వైదికగా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు.

Jr NTR in RRR

అసలు ఎన్టీఆర్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం వార్తల్లో నిలిచింది. దేవర సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది అని, అందులో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ అసలు స్పందించలేదు అని అంటున్న వారు ఈ వార్త వినంగానే కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. అంతే కాకుండా కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయం మీద స్పందించలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ లో ఉన్నారు.

ALSO READ : ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అంతగా ఏం ఉంది ఇందులో..?