మహాభారత యుద్ధం జరిగిన తరువాత కౌరవుల భార్యలు ఏమయ్యారు..?

మహాభారత యుద్ధం జరిగిన తరువాత కౌరవుల భార్యలు ఏమయ్యారు..?

by Anudeep

Ads

మహాభారతం లో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది ఉండదు అంటారు. ఈ కలియుగం లో ఎదురవుతున్న ఎన్నో రకాల పరిస్థితులు కూడా మహాభారతం లో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి. మహాభారతాన్ని మనం పూర్తి గా ఒక్కసారే తెలుసుకోలేకపోయినా.. అందులోని సంఘటనలను కధలు కధలు గా చెప్పుకుంటూనే ఉంటాం.

Video Advertisement

నిజానికి చాలామంది మహాభారతం కురుక్షేత్ర యుద్ధం పూర్తవడం తో ముగిసింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తరువాత కూడా పాలన కొనసాగింది. పాండవులు అధికారం చేపట్టారు. అయితే.. కౌరవులు యుద్ధం లో ఓడిపోయారు. వీరిలో కొందరు మరణించారు. వీరి భార్యలు ఏమయ్యారు..? అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత కౌరవుల భార్యలు ఏమయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణుడి భార్యను పాండవులు ఎంతగానో గౌరవించారు. ఆమెకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. ఆమె కొడుకుని కూడా పాండవులు ఎంతగానో ప్రేమించేవారు. కర్ణుడి కొడుకుకి అర్జునుడే స్వయం గా ధనుర్విద్య నేర్పించాడు. ఇక దుర్యోధనుడి భార్య కళింగ రాజు కుమార్తె. యుద్ధం తరువాత ఆమె ఏమైందో తెలియదు. దుర్యోధనుడికి లక్ష్మణ అనే కుమార్తె, లక్ష్మణ్ అనే కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ అభిమన్యుడి చేతిలో యుద్ధం 13 వ రోజునే మరణించాడు. లక్ష్మణను కృష్ణుడి కుమారుడు సాంబడు ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు.

kauravas wives 2

పాండవులు యుద్ధంలో గెలిచిన వార్త విన్న తరువాత ధృతరాష్ట్రుడు మరియు గాంధారి తమ కుమారులు మరియు కురు యోధులందరూ చనిపోయినట్లు తెలుసుకుని.. వారిని చూడాలని యుద్ధభూమికి వెళతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ కృష్ణుడు అక్కడకు వచ్చి వారిని సముదయిస్తాడు. కొడుకుల మృతదేహాలను చూసిన గాంధారి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఇదంతా శ్రీకృష్ణుడి వల్లే వచ్చిందని వాపోతుంది. యుద్ధం ముగిశాక, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు వంటివారంతా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు.

kauravas wives 4

ఇక కౌరవుల భార్యలను పాండవులే జాగ్రత్త గా చూసుకుంటారు. పాండవుల భార్యలు సైతం వారిని ఆదరిస్తారు. ఇక చివరలో.. వేదవ్యాసుడు ఒక అద్భుతాన్ని చేస్తారు. కురుక్షేత్రం లో మరణించిన వారిని తనకున్న శక్తితో ఒక్క రోజుకు తిరిగి తీసుకొస్తాడు. వారంతా తమ తండ్రులను, సోదరులను, భార్యలను కలుసుకుంటారు. కౌరవుల భార్యలకు వ్యాసుడు ఓ వరమిస్తాడు. ఎవరైతే.. భగీరధి నదులలో స్నానం చేస్తారో వారు తమ భర్తలను చేరతారని సెలవిస్తాడు. వారంతా అలాగే చేసి తమ భర్తల వద్దకే వెళ్ళిపోతారు.


End of Article

You may also like