Ads
దయ్యాలు నిజం గా ఉన్నాయా..? అభూత కల్పనా..? అంటే ఓ పట్టాన నిజమేంటో తెల్చేయ్యలేము. తాము దెయ్యాలను చూసాం అనే వారు దెయ్యాలు ఉన్నాయనే అంటారు.. లేని వాళ్ళు అవేమి నమ్మరు. కానీ కొన్ని చోట్ల మిస్టరీలు గా మిగిలిపోతున్న సంఘటనలు మాత్రం దెయ్యాలు ఉన్నాయా? అన్న సందేహాలను రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఓ మిస్టరీ నే కెనడాలో బాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ లోని రూమ్ నెంబర్ 873.
Video Advertisement
ఈ రూమ్ లో ఏమి జరిగింది.. ? ఎందుకు ఈ రూమ్ ను మూసేయాల్సి వచ్చింది అనే విశేషాలను ఈరోజు చెప్పుకుందాం. కెనడా లోని బాన్ఫ్ స్ప్రింగ్ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ రాయల్టీ నుంచి ఇక్కడ మార్లిన్ మన్రో కి కూడా స్వాగతం లభించింది. అయితే.. ఈ హోటల్ లోని రూమ్ నెంబర్ 873 మాత్రం ఓ మిస్టరీ గా మిగిలింది. ఆ హోటల్ రూమ్ లోకి దిగిన కస్టమర్స్ ఎవరైనా సరే ఆ హోటల్ మానేజ్మెంట్ కి కంప్లైంట్ చేస్తూనే ఉండేవారట.
ఆ రూమ్ లో పడుకున్నప్పుడు ఏవో శబ్దాలు వస్తున్నాయని, ఏడుపులు వినిపిస్తున్నాయని.. లేచి చూస్తే ఎవరు ఉండడం లేదని చెబుతున్నారట. ఓసారి ఓ భర్త, భార్య, వారి కుమార్తె కూడా ఈ హోటల్ కి వచ్చారట. వారికి రూమ్ నెంబర్ 873 నే ఇవ్వబడింది. అప్పటివరకు హ్యాపీ గా నవ్వుకుంటూ ఉన్న ఆ కుటుంబం.. ఆ రూమ్ లోకి వెళ్లిన తరువాత ఆ సంతోషం పోయినట్లు భావించింది. దానికి కారణం ఆ భర్త వింత ప్రవర్తనే. పడుకున్న సమయం లో ఆ భర్త తన భార్యని.. ఆ తరువాత తన కూతురిని, ఆ తరువాత తనను తానె చంపేసుకున్నాడట.
అప్పటివరకు బాగానే ఉన్న అతను.. అలా ఎందుకు ప్రవర్తించాడో ఎవ్వరికి అంతుపట్టలేదట. ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేకపోయింది. ఆ తరువాత కూడా ఆ రూమ్ పై ఆ కంప్లైంట్ లు వస్తూనే ఉన్నాయి. ఆ రూమ్ ను మూసివేయాలంటూ ఎంతమంది కోరినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ హోటల్ లో ఓ పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు కుటుంబాలు ముందుగానే ఆ హోటల్ కి వచ్చాయి.
పెళ్ళికూతురికి రూమ్ నెంబర్ 873 నే ఇచ్చారట. ఆ గదిలో ఉన్నంత సేపు ఆ పెళ్లి కూతురు బాగానే ఉంది. తీరా ముస్తాబయ్యి బయటకు వచ్చి మెట్లు దిగుతుండగా.. ఎవరో తోసేసినట్లు నేలకు జారడం తో రక్తం ఎక్కువగా కారి చనిపోయింది. అప్పటినుంచి ఆ హోటల్ యాజమాన్యం జాగ్రత్తల కోసం ఆ రూమ్ ను మూసివేసింది. ఆ రూమ్ ని పూర్తి గా పగలగొట్టలేదు.
ఆ తలుపులను తీసేసి గోడ కట్టించేసారు. ఎవరికీ ఆ రూమ్ ను మాత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ రూమ్ తో రూమ్ నెంబర్ 875 కనెక్ట్ అయ్యి ఉందని చెబుతూ ఉంటారు. ఈ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. దాదాపు పందొమ్మిదవ సెంచరీ నుంచి ఈ మిస్టరీ కొనసాగుతూ వచ్చింది. ఈ హోటల్ ను కొండల మధ్య చాలా ఎత్తైన ప్రదేశం లో కట్టారు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హోటల్ లో రూమ్ నెంబర్ 873 అంటే మాత్రం కస్టమర్లు హడలిపోతారు.
End of Article