Ads
ఇటీవల రోజులేమి అంత బాగాలేదు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా రక్షణ కరువైన పరిస్థితి ఉంది. మరోవైపు అమ్మాయిల విషయం తల్లితండ్రులు మరింత ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఒకే ఏరియా కి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లుండి కనిపించలేదు.
Video Advertisement
ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి మాయం అయ్యిన ఘటన జీడిమెట్ల పరిధిలోని సురారంకాలనీ వద్ద చోటు చేసుకుంది. అయితే.. ఈ ఇద్దరి అమ్మాయిల బ్యాగ్స్ మాత్రం సూరారం చెరువు కట్ట కనిపించడంతో వారి తల్లితండ్రులు ఆందోళన చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పరిధిలోని సురారంకాలనీకి చెందిన గాయత్రి, మౌనిక అనే ఇద్దరు అమ్మాయిలు పదవ తరగతి చదువుతున్నారు. కాగా, గత శనివారం ఈ ఇద్దరు అమ్మాయిలు స్కూల్ కి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఫ్రెండ్స్ ఇంటిలో కూడా తల్లి తండ్రులు అడిగి చూసిన లాభం లేకపోయింది. వారికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
ఇంతలో సూరారం చెరువు కట్ట వద్ద వారిద్దరి బ్యాగులు కనిపించాయి. దీనితో వారి తల్లితండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై వారు పోలీసులను సంప్రదించగా.. ఈ అమ్మాయిలని వెతకడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఎట్టకేలకు దొరికారు. వీరు సూరారం నుంచి నేరుగా ఐడీఎల్ బొల్లారం ప్రాంతానికి చేరుకొని అక్కడి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో తిరిగారు.
ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో లిఫ్ట్ అడిగి కార్ లో తిరిగి వారి కాలనీకి చేరుకున్నారు. అయితే.. ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయారు..? అంటూ పోలీసులు వారిని ప్రశ్నించారు. అందుకు వారు.. “ఇంట్లో సమస్యలు వస్తున్నాయని.. వాటి విషయమై ఇంట్లో వాళ్ళని బెదిరించడం కోసమే ఇంట్లోంచి వెళ్లిపోయామని” చెప్పుకొచ్చారు..
End of Article