“బల్లి శాస్త్రం” లో చెప్పేవి నిజమేనా…? అసలు బల్లి మీద పడినప్పుడు ఏమి జరుగుతుంది?

“బల్లి శాస్త్రం” లో చెప్పేవి నిజమేనా…? అసలు బల్లి మీద పడినప్పుడు ఏమి జరుగుతుంది?

by Anudeep

Ads

మన ఇంట్లో బల్లులు సంచరించడం చూస్తే మనలో చాలా మందికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చాలా మందికి బల్లి పట్ల ఎంతో కొంత భయం ఉండనే ఉంటుంది. మరికొందరైతే.. బల్లి గదిలో ఉంటె.. ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. బల్లి ఎటువంటి హాని చేయదు అని తెలిసినప్పటికీ.. బల్లిని చూడగానే ఒకరకమైన భీతికి గురి అవుతూ ఉంటారు.

Video Advertisement

దానికి కారణం ఏంటంటే.. బల్లి శరీరంపై పడితే భవిష్యత్ జరగబోయే దానికి సంకేతం అని కొందరు విశ్వసిస్తూ ఉంటారు. నిజానికి హిందూ సంప్రదాయాల ప్రకారం, మీపై ఎక్కడైనా బల్లి పడితే అది సానుకూల సంకేతంగా పరిగణించబడుతుంది.

lizard 1

ఈ బల్లులు ఏ అవయవంపై పడితే ఏమి జరుగుతుంది? అనే విషయాలను చెప్పే శాస్త్రాన్ని బల్లి శాస్త్రం అంటారు. మీ కుడి చేతిపై బల్లి పడితే.. మీరు బాగా ఎదిగి సమాజంలో గౌరవ ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని అర్ధమట. మీ ఎడమ చేతిపై బల్లి పడిపోతే మీరు డబ్బును కోల్పోతారని అర్ధం వస్తుందట. బల్లి పురుషుడి శరీరంలో కుడి వైపున మరియు స్త్రీ శరీరంలో ఎడమ వైపున పడితే అది అదృష్టానికి సంకేతంగా భావించాలని బల్లి శాస్త్రం చెబుతోంది.

lizard

ఉత్తరాన మీ తలపై బల్లి పడితే, అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. బల్లి తలపై పడినప్పుడు, వ్యక్తి సంపద, రాజసం పెరిగి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడని అర్ధమట. ఇక బాగా డబ్బు ఉన్న వ్యక్తి తలపై పడితే.. అతని సంపద హరించిపోతూ ఉంటుందని నమ్ముతారు. ఏవైనా రెండు బల్లులు సంభోగం చెందుతుండగా మీరు చూసినట్లయితే.. మీ పాత స్నేహితుడిని మీరు తిరిగి కలుస్తారని అర్ధం వస్తుందట. ఒకవేళ బల్లులు గొడవపడడాన్ని చూస్తే.. మీరు కూడా ఎవరితో అయిన వాదన పెట్టుకోవాల్సి వస్తుందని అర్ధమట. కొంతమంది తమ కొత్త ఇంటిలో బల్లిని చూడటం లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా భావిస్తుంటారు. ఇందులో అన్ని నిజం కాకపోవచ్చు.. కానీ చాలా మంది చాలా కాలంగా వీటిని నమ్ముతూ వస్తున్నారు.


End of Article

You may also like