Ads
స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు ఇప్పుడు చాలా అరుదు గా కనిపిస్తారేమో. అంతగా ఇది మన జీవితాల్లో అలవాటు అయిపొయింది. అయితే.. స్మార్ట్ ఫోన్ ల వాడకం కూడా ఎక్కువ గానే ఉండడం ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా ఓ సమస్య అయిపోయి కూర్చుంది. మనలో చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ని వాడము కాబట్టి.. ఆ టైం లో ఛార్జింగ్ పెట్టేసుకుని పడుకుండిపోతాం.
Video Advertisement
ఒక ఫోన్ బాటరీ ఫుల్ అవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కానీ, మనం దాదాపు ఐదారు గంటల పాటు అలానే వదిలేస్తుంటాం. దీని వలన ఫోన్ లు పేలిపోయే ప్రమాదం ఉంటుందని అని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటి కేసు లు కూడా మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాం. అయినా ఒక థీమా ఏంటి అంటే.. మన ఫోన్ కి ఏమి కాదులే అని.. కానీ అన్నేసి గంటలు ఛార్జింగ్ లో పెట్టేస్తే.. ఫోన్ పేలడం తో పాటు ఇతర సమస్యలు కూడా ఉంటాయండోయ్..
ఒకసారి బాటరీ ఫుల్ అయిపోయిన తరువాత కూడా తీసెయ్యకపోతే బాటరీ ఉబ్బిపోయి ఇక పనికిరాదట. ఒక్కోసారి బాటరీ వెంట వెంటనే డౌన్ అయిపోతుంది. కొత్త ఫోన్ కొనుక్కోవడమో, బాటరీ మార్పించుకోవడమో చేయాల్సి వస్తుంది ఇలా చేస్తే. అయితే.. ఈ మధ్య వస్తున్నా కొత్త మోడల్ మొబైల్స్ లో ఇలాంటి ఇబ్బంది లేకుండా బాటరీ ఫుల్ అవగానే.. రిసీవింగ్ ని ఆపేసేవిధం గా టెక్నాలజీ రూపొందించారట. అయినా కూడా.. మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిందే సుమా. ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం కదా..
End of Article