సాధారణం గా మానవ అర చేతి పై ఉండే గీతలు వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని చెబుతుంటారు. ఈ అర చేతిలోని రేఖల్ని బట్టి జీవితం లో విద్య, ఉద్యోగం, వివాహం వంటి విషయాలను ఎలా జరుగుతాయో అంచనా వేసి చెప్పడానికి పామోలజీ అనే శాస్త్రం కూడా ప్రత్యేకం గా రూపొందించబడింది. మనం ఇప్పుడు ఈ శాస్త్రం గురించి పూర్తి గా చెప్పుకోకపోయినా.. మీ అరచేతిలో ఎక్స్ గుర్తు ఉంటె ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

x sign 1

మీ రెండు అరచేతులను దగ్గరగా పెట్టి గమనించి చూడండి. అర చేతి పైన మూడు రేఖలు ఉంటాయి కదా. వీటి మధ్యన ఎక్స్ (X) ఆకారం లో గీతలు ఉన్నాయేమో పరిశీలించి చూడండి. ఒకవేళ అలా గీతలు ఉంటె.. మీరు హీరో కిందే లెక్క. మీరు ప్రపంచాన్ని జయించగలిగేటంతటి శక్తీ ని కలిగి ఉంటారు. ఎంతటి పనినైనా.. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా మీరు పట్టు విడవకుండా సాధించగలరు.ఈ విషయం సైంటిస్ట్ ల పరిశోధనల్లో కూడా తేలిందట. అలెగ్జాన్డర్ కి కూడా ఇలానే చేతిపై ఎక్స్ గుర్తు ఉందట. అందుకే ఆయన యుద్ధాల్లో విజయం సాధించేవాడని చెబుతుంటారు.

x sign 2

దీనిపై యూఎస్ఏ మాస్ట్రో లోని ఓ యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారట. పలువురి ప్రముఖుల హస్త రేఖలను వీరు అధ్యయనం చేశారట. వీరు అధ్యయనం చేసిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దివంగత అబ్రహం లింకన్ హస్త రేఖలు కూడా ఉన్నాయట. వీరు కూడా ప్రపంచం లో ఉన్నత స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే.. రెండు అరచేతిల్లోనూ ఎక్స్ ఆకారం లో గుర్తు ఉంటె.. వారు ప్రతిభావంతులు గా ఉంటారని, ఎలాంటి ప్రణాళిక లు లేకపోయినా ముందుకు దూసుకెళ్తారని చెబుతున్నారు.

x sign 3

వారు విజయం కోసం ప్రయత్నించకపోయినా…వారి వెంట విజయం నడిచొస్తుందట. అవతలి వారిని చూడగానే వారు సులభం గా ఓ అంచనా కి రాగలుగుతారట. వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ ఎవరైనా వీరిని మోసం చేయాలనుకున్నా వారే నష్టపోతారట. వీరి శారీరకం గా , మానసికం గా బలవంతులు గా ఉంటారట. వీరు తమ జీవితాల్లోనే కాదు.. తమ చుట్టూ వారి జీవితాల్లో కూడా మార్పుని తీసుకురాగలరు. కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుని.. వీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతారట.