Ads
శరీరం మొత్తం లో ప్రతి అవయవం కీలకమైనది. అయితే, పాదాలు మరింత ముఖ్యమైనవి. శరీరం బరువు మొత్తం అవే మోస్తాయి. అందుకే మనం పాదాలను ఎప్పుడు పరిరక్షించుకోవాలి. వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వాటికి ఇచ్చి శుభ్రం గా ఆరోగ్యం గా ఉండేవిధం గా చూసుకోవాలి. అయితే ఫ్యాషన్ కోసం హై హీల్స్ వేసుకోవడం, ఎక్కువ సేపు నిలబడే పనులు చేసుకోవాల్సి రావడం వంటి కారణాలతో పాదాలపై ఒత్తిడి పడుతోంది.
Video Advertisement
వీటి వలన చాలా మందికి అరికాలి లో మంటలు, పాదాల నొప్పులు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం స్ప్రే , పెయిన్ కిల్లర్ వంటి వాటిని వాడి మరిన్ని ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక పై ఇలా చేయకుండా..ఓ చిట్కా ను పాటించండి.మీ పాదాలకు టేప్ వేసుకుని పడుకోండి. అయితే, సాధారణం గా వినియోగించే టేప్ ను కాకుండా రిజిడ్ స్పోర్ట్స్ టేప్ అని షాప్ లో ఓ టేప్ దొరుకుతుంది. దీనిని రాత్రి పూట మీ కాలి వేళ్ళకు వేసుకుని పడుకోండి.
ఈ టేప్ 8 ఎం.ఎం మందంతో చాలా స్టిఫ్ గా ఉంటుంది. మీ కాలి చూపుడు వేలు, మధ్య వేలును దగ్గరగా జరిపి ఈ ప్లాస్టర్ ను వేయాలి. రాత్రంతా అలా ఉంచేసి మీరు నిద్రపోండి. తిరిగి ఉదయాన్నే ఈ ప్లాస్టర్ ను తీసివేయండి. దీనివలన చాలా రిలీఫ్ గా ఉంటుంది. మనం నడిచే సమయం లో పాదాలపై ఒత్తిడి పడి నొప్పులు వస్తుంటాయి. ఇలా వేయడం వలన నొప్పులు తగ్గుతాయి. అలాగే పాదాలకు ఏమైనా స్వల్ప గాయాలు అయినా.. అవి మానడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.
అలాగే అవుట్ డోర్ గేమ్స్ ఆడుతున్న సమయం లో కూడా ఇలా ప్లాస్టర్ ను వేయడం వలన మీ పాదాలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అయితే, టేపింగ్ చేయడం వలన మీ పాదాలపై దురద లేక ఎర్ర గా అవడం వంటి లక్షణాలు ఉంటె మీరు వైద్యుడిని కలవడం మంచిది.
End of Article