Ads
ప్రతి దేశానికీ సైన్యంలో కొన్ని జంతువులు కూడా కీలక పాత్రలను పోషిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, కుక్కలు మందుపాతరలు గుర్తించడానికి.. రక్తపు మరకలను బట్టి వ్యక్తులను గుర్తించడానికి ఎంతగానో సాయం చేస్తూ ఉంటాయి. అయితే.. కొన్ని సందర్భాలలో రవాణా కోసం గుర్రాలను కూడా వినియోగిస్తూ ఉంటారు.
Video Advertisement
ఈ జంతువులు ఉరకలేసే వయసులో ఉన్నప్పుడు ఉత్సాహంగా పని చేస్తాయి. వీటికి అందుకు తగ్గట్లే ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ, వాటి లైఫ్ స్పాన్ చివరకి వచ్చిన తరువాత అవి మునుపటిలా ఉత్సాహంగా పనిచేయలేకపోతాయి.
మనుషులు 60 ఏళ్ల వరకూ పని చేసినట్లే.. జంతువులు కూడా పరిమిత కాలం వరకే పని చేయగలుగుతాయి. ఇలా.. ఆర్మీ లో పని చేసే జంతువులు రిటైర్ అయ్యే వయసుకు వచ్చాక ఏమి అవుతాయి..? అన్నది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. భారత ఆర్మీలో పని చేసే కుక్కలను, గుర్రాలను రిటైర్ అయ్యే వయసుకు వచ్చాక సైన్యం కాల్చివేస్తుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ ఆరోపణల్లో నిజమెంత? ఇది నిజంగా అమానవీయ చర్యే. అయితే.. ఇందులో నిజమెంత, నిజంగానే సైన్యం ఇలాంటి పని చేస్తుందా? అన్న అనుమానాలు చాలా మందిలోనే ఉన్నాయి.
ఎక్కువగా ఆర్మీలో జర్మన్ షెపర్డ్, లాబ్రడార్, బెల్జియన్ షెపర్డ్ వంటి కుక్కలకు శిక్షణ ఇస్తుంటారు. వీటికి కూడా పేర్లు, రాంక్ లు ఉంటాయి. వాటి పదవీ కాలం అయిపోయాక అవి చేసిన గొప్ప పనులను గుర్తించి.. వాటికి సత్కారాలు కూడా చేస్తారు. అయితే.. ది ప్రింట్ లోని ఓ నివేదికలో.. ఆర్మీ ప్రతినిధి కుక్కల గురించి తెలిపారు. సైన్యంలో రిటైర్ అయిన తరువాత వాటిని కాల్చడం అంటూ జరగదని.. కొన్ని జంతువులు కోలుకోలేని వ్యాధులతో అవస్థ పడుతుంటే.. వాటికి మాత్రమే అనాయాస మరణాన్ని ఇస్తారని వివరించారు. దేశ భద్రతని దృష్టిలో ఉంచుకునే కుక్కలను రిటైర్ అయ్యాక కాల్చి చంపేస్తూ ఉంటారని..ఇప్పటికీ కొందరు అంటూ ఉంటారు.
Also Read: బ్లేడ్ ను ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని ఎవరు తయారు చేసారో తెలుసా?
ఆటో డ్రైవర్లు ఇలా సైడ్ కి ఎందుకు కూర్చుంటారు.? వెనకున్న కారణాలు ఇవే.!
End of Article