Ads
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను రూపొందిస్తున్నారన్న ఆరోపణల నేపధ్యం లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించడం కోసం ఆయన ఎక్కువ మంది మహిళలను తీసుకొచ్చినట్లు పోలీసులకు కంప్లయింట్లు అందడం తో ముంబై పోలీసులు రాజ్ కుంద్రా ను అరెస్ట్ చేసారు. రాజ్ కుంద్రా కు “హాట్ షాట్” అనే ఆప్ ఉంది. ఈ అప్ కు యూకే లింక్స్ ఉన్నట్లు పోలీసులకు వార్తలు అందాయి.
Video Advertisement
నివేదిక ల ప్రకారం, సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 34 (కామన్ ఇంటెన్షన్), 292 మరియు 293 మరియు ఐటి చట్టంలోని ఇతర విభాగాలు మరియు మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధ) చట్టం కింద రాజ్ కుంద్రా ను అరెస్ట్ చేసారు. ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం, అసభ్యకరమైన కంటెంట్ ను అమ్మడం, పంపిణి చేయడం, అద్దెకు ఇవ్వడం వంటి పనులు చేస్తే అది నేరం గా పరిగణించబడుతుంది. అలాగే.. వ్యాపార రీత్యా, లేదా లాభాలను ఆశించి ఈ విధమైన కంటెంట్ ను బహిరంగంగా ప్రదర్శించడం లేదా ఏ మాధ్యమం ద్వారా అయినా చెలామణి లో ఉండేవిధం గా చేస్తే, దానిని ఇండియన్ లా నేరం కింద పరిగణిస్తుంది.
ఐపిసి సెక్షన్ 293 విభాగం వయసుని గురించి చెబుతుంది. ప్రేక్షకుల వయసు ను ఈ విభాగం నిర్ణయిస్తుంది. ఎవరైనా ఇరవై సంవత్సరాల లోపు వయసు ఉన్న వ్యక్తులకు అశ్లీల కంటెంట్ ను విక్రయించడం, ప్రదర్శనకి ఉంచడం, అద్దెకి ఇవ్వడం వంటివి చేస్తారో వారిని ఇండియన్ లా నేరస్తుల కింద పరిగణిస్తుంది. అలాగే ఈ పని చేయడానికి ఎవరినైనా పురమాయించి, వారికి ఆఫర్లు ఇచ్చినా కూడా నేరం కిందే పరిగణించబడుతుంది.
అలాగే ఐటి చట్టంలోని సెక్షన్ 67 కింద కూడా రాజ్ కుంద్రా పై కేసు నమోదు చేయబడింది. ఎవరైతే అశ్లీలం లేదా శృంగారభరితమైన కంటెంట్ ను ఎలక్ట్రానిక్ మీడియా రూపం లో ప్రసారం చేస్తారో వారిని లా ప్రకారం నేరస్తులగానే పరిగణిస్తారు. ఏ పరిస్థితిలో ఈ పని చేసినా అది నేరం కిందే పరిగణించబడుతుంది. ఇదంతా నాణేనికి ఒక వైపు ఉంటె.. మరో వైపు అడల్ట్ చిత్రాల చిత్రీకరణ భారత దేశం లో నిషేధించబడింది. ఈ విషయం లో ప్రభుత్వం కూడా కఠినం గా వ్యవహరిస్తూ ఇటువంటి సైట్లను బ్లాక్ చేస్తూ వస్తోంది.
End of Article