Ads
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలను వారి సంప్రదాయాల ప్రకారంగా చేస్తారు. దీనిని వివిధ మతాల వారు వారి పద్ధతులలో జరుపుతారు.
Video Advertisement
ఇక హిందూమతంలో ఎన్నో ఆచార, సంప్రదాయాలను పాటించడం అనేది ఆనవాయితీగా మారింది. వీటిలో భాగంగానే హిందువులు ఎవరైనా చనిపోయినట్లయితే వారికి దహన సంస్కారాలు చేయడం ఆచారంగా వస్తోంది. అయితే మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడం వెనుక ఉన్న విషయాలు ఎక్కువ మందికి తెలియవు.
దేహము మరియు ఆత్మ:
సాధారణంగా హిందువులు మరణించివారి శరీరాన్ని పాతిపెట్టకుండా దహనం చేస్తారు. సంస్కృతంలో మరణంను ‘దేహంత’ అంటారు. దానికి అర్ధం ఏమిటంటే దేహానికి అంతం. కానీ ఆత్మకి కాదు. హిందూ తత్వశాస్త్రంలో చెప్పిన ముఖ్యమైన సిద్ధాంతాలలో దేహం, ఆత్మకి మధ్య ఉండే వ్యత్యాసం కూడా ఒకటి. హిందూ తత్వశాస్త్రం ప్రకారం దేహం, ఆత్మ రెండు వేరుగా ఉంటాయి. ఆత్మ తాత్కాలికంగా నివసించే ప్రదేశమే దేహం. మనిషి మరణించినపుడు దేహం మరణిస్తుంది. కానీ ఆత్మకి మరణం ఉండదని హిందువుల విశ్వాసందహన సంస్కారాలు చేయడం వెనుక ఉన్నకారణాలు:
ఈ లోకంలో అందరు వారి మతాలకు సంబంధించిన ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ క్రమంలో హిందువులు కూడా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మనిషి చనిపోయిన తరువాత కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేహానికి కట్టుబడి ఉంటుందని నమ్ముతారు. మనిషి దేహాన్ని దహనం చేయడం వల్ల ఆత్మకు విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే మనిషి బతికి ఉన్న సమయంలో తెలిసి, తెలియకుండా చాలా పాపాలను చేస్తారు.
ఆ మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి దేహాన్ని అగ్నిలో కాల్చడం వల్ల అతడు చేసిన పాపాలన్ని నశించి, మరు జన్మలో శుద్ధమైన ఆత్మతో జన్మిస్తాడని విశ్వాసం. అందువల్లనే మరణించిన వారి దేహాన్ని దహనం చేస్తారు. అంతే కాకుండా మరణించిన వారిని ప్రధానంగా చెరువులు, నదులు, నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో దహనసంస్కారాలను నిర్వహిస్తుంటారు. నీరు ఉన్న ప్రదేశంలో దహన సంస్కారాలు చేయటం ద్వారా చనిపోయిన వారి ఆత్మ పరిశుద్ధం అవుతుందని నమ్ముతారు.
అలాగే మరణించిన వ్యక్తి దేహం నుండి ఆత్మకు విముక్తి దొరకాలంటే ఖచ్చితంగా దహనం చేయాలని నమ్ముతారు. దహనసంస్కారాలు పూర్తి చేసిన తరువాత మరణించిన మనిషి యొక్క అస్థికలను సేకరించి, పుణ్య నదులలో కలుపుతారు. ఈ విధంగా మరణించిన వారి అస్థికలను నదులలో కలపడం ద్వారా వారి ఆత్మ పంచ భూతాలలో కలిసిపోతుందని విశ్వసిస్తారు. చివరిగా మరణించిన వారికి పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు పునర్జన్మ లేదా మోక్షం కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా మనిషి మరణించినపుడు చేసే ఈ ఆచారాలను అంతిమ సంస్కరణలుగా భావిస్తారు.Also Read: “గంగమ్మ తల్లి జాతర” అంటే ఏంటి..? ఆ జాతరలో భక్తులు ఇలా ఎందుకు వేషాలు వేస్తుంటారు..?
End of Article