గురు పౌర్ణమి నాడు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే అంతా శుభమే..!

గురు పౌర్ణమి నాడు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే అంతా శుభమే..!

by Anudeep

Ads

తెలుగు నెలలలో నాలుగో నెల ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆషాడ మాసాన్ని శూన్యమాసం అని పిలుస్తారు. శూన్య మాసం అంటే ఎలాంటి శుభకార్యాలకు అనువైనది కాదు అని అర్థం. ఈ శూన్య మాసంలోనే తొలి ఏకాదశి, దక్షిణాయనం వంటి పర్వదినాలు మొదలవుతాయి.

Video Advertisement

అదేవిధంగా ఈ ఆషాడ మాసం లో వచ్చిన  శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమి అని పిలుస్తారు. గురుపౌర్ణమినే వ్యాస పూర్ణిమ అని అంటారు. వేదవ్యాసుల వారు ఈ రోజునే జన్మించారు. గురు పౌర్ణమి అంటే భగవంతుడు మనకు ఇచ్చిన సంపూర్ణమైన వేదాన్ని  గురువు వేదవ్యాసులు మానవుని యొక్క సౌలభ్యం కోసం నాలుగు భాగాలుగా ఈ రోజునే విభజించి రాశారు. జగత్ గురువు అయినటువంటి ఈ వేదవ్యాసులవారు పుట్టినరోజునే గురుపౌర్ణమిగా జరుపుకుంటారు.

Vedha vyasa

ఈ గురు పౌర్ణమి నాడు ఉదయాన్నే లేవగానే ఎలాంటి పనులు చేయాలి. ఆ 3 పనులు చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటో మనం ఎప్పుడు కలుసుకుందాం.

#1. తల్లిదండ్రులు నమస్కరించడం :

ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు అనేవారు మొదటి గురువులు. ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వాళ్ల పాదాలకు నమస్కరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా సత్ప్రవర్తన కలిగి మంచి అభివృద్ధిలోకి వస్తారు.

#2. గురువు స్మరించడం :

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానం అయినవారు గురువులు. మీ గురువులు మీ దగ్గరలో ఉంటే వారికి పాదాభివందనం చేయాలి. దగ్గర లేని గురువులు అయితే వాళ్ళ మనసులో తలచుకుని వారు చెప్పిన మంచి మాటలను స్మరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గురు దూషణ మాత్రం చేయకూడదు. అది ఇప్పుడు గాని ఇంకెప్పుడైనా గాని గురువుని  దూషించడం ద్వారా సకల పాపాలు చుట్టుకుంటాయి అని పురాణాలు చెబుతున్నాయి.

#3. గురువుకి బహుమతి ఇవ్వటం :

నీకు విద్య నేర్పిన గురువులకు ఏదైనా పండు గాని, ఫలము గాని ఇచ్చి నమస్కరించుకోవాలి. గురువుగారు మీకు దగ్గరగ అనుకూలంగా లేనప్పుడు ఎవరైనా బ్రాహ్మణుులకు ఇచ్చి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటారు విద్యార్థులు. కేవలం ముఖ్యమైన పర్వదినాల్లో అప్పుడు మాత్రమే గురువును గౌరవించడం  అనేదే కాకుండా నిత్యం గురువును గౌరవిస్తుండాలి. అప్పుడే ఆ విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు.


End of Article

You may also like