విమానం లోని టాయిలెట్స్ ను ఆకాశం లోనే క్లీన్ చేస్తారా..? ఆ వ్యర్ధాలను ఎలా ఖాళీ చేస్తారు..?

విమానం లోని టాయిలెట్స్ ను ఆకాశం లోనే క్లీన్ చేస్తారా..? ఆ వ్యర్ధాలను ఎలా ఖాళీ చేస్తారు..?

by Anudeep

Ads

మనకి కొన్ని కొన్ని సార్లు వింత వింత డౌట్ లు వస్తూ ఉంటాయి కదా.. ఉన్నట్లుండి మనం ఉన్న రూమ్ లో ఫ్యాన్ ఊడి కింద పడితే ఏమవుతుంది..? అని సడన్ గా ఆలోచిస్తూ ఉంటాం. ఇది కూడా అలాంటి డౌటే. విమానం లోని టాయిలెట్స్ ను ఆకాశం లోనే క్లీన్ చేస్తారా..? అనే వింత డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..?

Video Advertisement

ఏమి వర్రీ అవకండి.. ఆలోచించే తెలివితేటలు ఉన్న వారికే ఇలాంటి డౌట్ లు వస్తుంటాయి. ఇంతకీ విమానం లో టాయిలెట్స్ ను ఎప్పుడు క్లీన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం..

aeroplane 1

రైల్లో ఉన్నట్లే విమానం లో కూడా టాయిలెట్స్ ఉంటాయి.. అయితే.. రైళ్లలో లాగా వ్యర్ధాలన్నీ కింద పడిపోతాయా..? అంటే కాదు. విమాన సంస్థలకు ఈ విషయం లో కచ్చితమైన రూల్స్ ఉంటాయి. ఇలా వ్యర్ధాలు కిందకి పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటారు.. విమానాలు జనావాసాలపై నుంచి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వ్యర్ధాలు లీకవ్వడానికి వీలు లేదు. అలా జరిగితే వారు ఎక్కువ మొత్తం లో ఫైన్స్ కట్టాల్సి ఉంటుంది.

aeroplane 3

అయితే విమానాల్లో ఉండే బాత్ రూమ్ లు సాధారణం గా ఉండే బాత్ రూమ్ ల కంటే భిన్నం గా ఉంటాయి. ఈ టాయిలెట్స్ లో వ్యర్ధాలను కలెక్ట్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ సిస్టం లను అమరుస్తారు. అలాగే టాయిలెట్ బౌల్ ను వాష్ చేయడానికి నీలి రంగులో ఉండే స్కైకెమ్ అనే లిక్విడ్ ను ఉపయోగిస్తారు. విమానం లోకి నీటిని మోసుకెళ్ళాలి అంటే విమానం లో బరువు పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. అందుకే, ఫ్లష్ ట్యాంక్ లోని నీటిలో ఈ లిక్విడ్ ని కలుపుతారు.

aeroplane 2

టాయిలెట్ కి వెళ్ళాక.. ఫ్లష్ చేయగానే ఈ లిక్విడ్ పడుతుంది. టాయిలెట్ బౌల్ కి అటాచ్ చేయబడిన వాక్యూమ్ సిస్టం ఈ వ్యర్ధాలను కలెక్ట్ చేస్తుంది. అలా బౌల్ శుభ్రపడుతుంది. విమానం ఆకాశం లో ఎగురుతున్నపుడు అందులో ఉష్ణం తగ్గి ఈ వ్యర్ధాలన్నీ గడ్డకట్టుకుపోతాయి. అందుకే లీక్ అయ్యే అవకాశం ఉండదు. తిరిగి టేక్ ఆఫ్ అయ్యే సమయం లో ఉషోగ్రత పెరిగి ఈ వ్యర్ధాలు ద్రవపదార్ధాలు గా మారతాయి. విమానం ల్యాండ్ అయిన తరువాత సెప్టిక్ ట్యాంక్ లను క్లీన్ చేసినట్లే.. ఈ వ్యర్ధాలను కూడా ట్యాంకర్ల సాయం తో బయటకు తీసేసి విమానం లోని టాయిలెట్స్ ను శుభ్రం చేస్తారు.


End of Article

You may also like