రెడీ మేడ్ షర్ట్స్ వెనకాల ఇలాంటి లూప్ ని గమనించారా..? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా..?

రెడీ మేడ్ షర్ట్స్ వెనకాల ఇలాంటి లూప్ ని గమనించారా..? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Anudeep

Ads

మనం రోజు వారి దినచర్యలో గమనించే చాలా విషయాలను పట్టించుకోకుండా ఉంటాం. తీరా దాని ఉపయోగం ఏంటో తెలిసాక ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటిదే ఇది కూడా. మీరెప్పుడైనా గమనించారా..? చాలా వరకు వచ్చే రెడీ మేడ్ షర్ట్ ల వెనకాల ఇలాంటి లూప్ ఒకటి ఉంటుంది.

Video Advertisement

ఇది ఎందుకు ఇస్తారో..? దీని వలన ఉపయోగం ఏంటో తెలుసా..? తెలియక పోతే ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి. సాధారణంగా మనం ఆఫీస్ లేదా.. కాలేజీ కి వెళ్లి వచ్చిన తరువాత ఆ షర్ట్ ని హాంగర్ కి తగిలించి జాగ్రత్త పెడతాం.

loop 1

అలా ఉంచడం వలన షర్ట్ కి ఉన్న ఇస్త్రీ మడతలు పోకుండా ఉంటాయి. మరో సారి ఆ షర్ట్ ని ధరించాలని అనుకుంటే ఆ షర్ట్ నీట్ గా ఉంటుంది. అయితే ఈ లూప్ అనేది షర్ట్ వెనకాల ప్లీట్.. యోక్‌కి కలిసే చోట ఇస్తారు. ఇది చూడడానికి డిజైన్ లాగా అనిపిస్తుంది. కానీ డిజైన్ అనుకుంటే పొరపాటే. ఇది డిజైన్ కాదు. వార్డ్ రోబ్ లు, హ్యాంగర్లు లేని రోజుల్లో ఈ లూప్ వల్ల చాలా ఉపయోగం ఉండేది.

loop 2

ఆ రోజుల్లో చొక్కాలకు ముడతలు పడకుండా ఈ లూప్ తో మేకులకు తగిలించి వారు. అప్పుడు ఆ చొక్కాలకు నీట్ గా ఉండేవి. 1960 లలో US-తయారైన ఆక్స్‌ఫర్డ్ బటన్-డౌన్ చొక్కాలతో ఈ ట్రెండ్ మొదలైంది. మొదట దీనిని లాకర్ లూప్ అని పేరు పెట్టారు. ఆ తరువాత కాలంలో  ఫెయిరీ లూప్, ఫాగ్ ట్యాగ్ లేదా ఫ్రూట్ లూప్ అని కూడా పిలవడం మొదలు పెట్టారు. చాలా బ్రాండ్స్ ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నాయి. హ్యాంగర్లకు తగిలించుకునే ఫెసిలిటీ ఉన్నప్పటికీ ఈ లూప్ ఒక డిజైన్ లా బాగుండడంతో ఈ ట్రెండ్ నేటికీ కొనసాగుతోంది. హ్యాంగర్స్ లేని టైములో ఈ లూప్ సాయంతో ఎంచక్కా మీ చొక్కాని మడతలు లేకుండా తగిలించేసుకోవచ్చు.


End of Article

You may also like